టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీలకు తాము పనిచేసిన సినిమా పేర్లే ఇంటి పేర్లుగా మారిపోయాయి. దానికి కారణం మొదటి సినిమాలే విజయం సాధించడం….ఆ సినిమాతోనే వారు గుర్తుండిపోయే స్థాయికి ఎదగటం. అలా తొలిసినిమానే ఇంటి పేరుగా మారిన వారిలో ఒకప్పటి నటీనటుల నేటి తరం నటీనటుల వరకూ ఉన్నారు. అలా పేరు తెచ్చుకున్నవారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Sirivennela seetharama sastry
ఇటీవల మరణించిన సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెల కాదు. ఆయన మొదటిసారి పనిచేసిన సిరివెన్నెల సినిమానే ఆయనకు ఇంటిపేరుగా మారిపోయింది. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలతో ఎంతో గుర్తింపు రావడంతో సీతారామాశాస్త్రి సిరివెన్నెలగా మారిపోయారు.
Ad
ALLARI NARESH
అల్లరి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో నరేష్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నరేష్ అల్లరి నరేష్ గా మారిపోయారు.
Advertisement
DILL RAJU
నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో పేరుతెచ్చుకున్న రాజు దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రాజు కాస్తా దిల్ రాజుగా మారిపోయాడు.
VENNELA KISHORE
వెన్నెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు కిషోర్. వెన్నెల సినిమాలో కమెడియన్ గా అలరించిన కిషోర్ పేరు వెన్నెల కిషోర్ గా గుర్తుండి పోయింది.
SATYAM RAJESH
సత్యం సినిమాతో టాలీవుడ్ నటుడిగా పరిచమైన రాజేష్ ఆ తరవాత సత్యం రాజేష్ గా మారిపోయాడు.
SHAVUKARU JANAKI
షావుకారు జానకి…ఈ సీనియర్ నటి షావుకారు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తరవాత ఆమె పేరు షావుకారు జానకిగా గుర్తుండి పోయింది.