Home » భార్య ఉండ‌గానే మ‌రొక‌రితో ప్రేమలో పడ్డ 6 స్టార్ నటులు !

భార్య ఉండ‌గానే మ‌రొక‌రితో ప్రేమలో పడ్డ 6 స్టార్ నటులు !

by AJAY
Ad

టాలీవుడ్ నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ తో కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజ‌న్లు ఈ జంటను తిట్టిపోస్తున్నారు. నరేష్ కు ఇప్పటికే మూడు వివాహాలు కాగా వారితో విడాకులు తీసుకున్నాడు. అయితే మూడో భార్య మాత్రం ఇంకా విడాకులు ఇవ్వలేదని పవిత్రకు దగ్గర అవడం వల్లనే నరేష్ తనను దూరం పెట్టడని మీడియా ముందు ఆరోపించింది. దాంతో భార్య‌ ఉండగానే న‌రేష్ మరో మహిళతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే నరేష్ మాత్రమే కాకుండా టాలీవుడ్లో కొందరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని భార్య ఉండగానే మరొకరితో రిలేషన్ పెట్టుకున్నారు ఆ సెల‌బ్రెటీలు ఎవరు ఇప్పుడు చూద్దాం…

Advertisement

Also Read: జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని చంద్రబాబు ఒట్టు… సంచలన విషయాలు బయటపెట్టిన వంశీ..?


ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొద‌ట లతను వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా అప్పటికే వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుదేవా తన భార్యను విడిచిపెట్టి హీరోయిన్ నయనతారతో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు.

Advertisement


టాలీవుడ్ సార్ హీరో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే భార్య ఉండగానే పవన్ కళ్యాణ్ తీన్మార్ నటి అన్న లెజెనోవాతో రిలేషన్షిప్ పెట్టుకున్నారు.

ఒకప్ప‌టి త‌మిళ‌ స్టార్ హీరో జెమినీ గణేషన్ భార్య అలమేలు ఉండగానే సావిత్రితో రిలేషన్ పెట్టుకున్నారు. అంతేకాకుండా హీరోయిన్ పుష్పవల్లితో సైతం జెమినీ గణేషన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సావిత్రి జీవితం నాశనం అవ్వడానికి కూడా జ‌మిని గ‌ణేష‌న్ అనే ఆరోప‌ణ‌లు సైతం ఉన్నాయి.

Also Read:   ఈ రెండు వస్తువుల వల్ల మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది.. డబ్బే డబ్బు.. !


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ రీనా ద‌త్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత డిజైనర్ కిరణ్ రావు తో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు రీసెంట్ గా కిరణ్ రావుకు సైతం విడాకులు ఇచ్చాడు.

బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ పెళ్లై పిల్లలు ఉండగానే హీరోయిన్ శ్రీదేవి పై మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీదేవి తో రిలేషన్షిప్ లో ఉండి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

Also Read:  ఆ హీరోయిన్ తో SR:ఎన్టీఆర్ పెళ్లి పీటల దాకా వెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading