Telugu News » BREAKING : సీడీఎస్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌

BREAKING : సీడీఎస్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌

by Bunty

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో.. ఇవాళ మధ్యాహ్నం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో… సిడిఎస్ బిపిన్ రావత్ మరణించారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటన చేసింది. చివరి వరకు మృత్యువుతో పోరాడిన బిపిన్ రావత్ చివరికి కన్నుమూశారు. బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధూలిక… మరో 11 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Bipin Rawat

Bipin Rawat

కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే బతికి ఉన్నారని… ఆయన వెల్లింగ్టన్ లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం అందుతోంది. కాగా ఈ హెలికాప్టర్ ప్రమాదం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో… హెలికాప్టర్ లో ఏకంగా 14 మంది ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాదంపై రేపు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

Visitors Are Also Reading