Home » ఐటిఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు… పూర్తి వివరాలు ఇవే

ఐటిఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు… పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

ఐటిఐ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ట్రేడ్ అప్రెంటిస్ అండ్ ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 608 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఖాళీలు, అర్హతలు…

నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 608 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రేడ్ అప్రెంటిస్ (536), ఫ్రెషర్ అప్రెంటిస్ (72) పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ళు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

Advertisement

 

ఫ్రెషర్ అప్రెంటిస్ లకు పదవ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ అనుసరించి రూ. 6000, రూ.9000 వరకు స్టైపెండ్ అందిస్తారు. అభ్యర్థులను మెరిట్ బేసిస్/రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు గడువును జూన్ 18వ తేదీగా నిర్ణయించారు.

 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వంటలక్క బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా..ఆమె పేరుపై వందల కోట్ల ఆస్తులు !

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

విదేశాల్లో చదువుల కోసం… ఇంటిని అమ్మి మరీ… చివరికి!

Visitors Are Also Reading