Telugu News » Womens World Cup 2022 : ఉత్కంఠ మ్యాచ్‌లో విజ‌యం సాధించి భార‌త్‌ను వెన‌క్కు నెట్టిన విండిస్

Womens World Cup 2022 : ఉత్కంఠ మ్యాచ్‌లో విజ‌యం సాధించి భార‌త్‌ను వెన‌క్కు నెట్టిన విండిస్

by Anji

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ 2022 17వ మ్యాచ్‌లో వెస్టిండిస్ 4 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. కేవ‌లం 140 ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ వెస్టిండిస్ చివ‌రి ఓవ‌ర్‌లో బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేయ‌డం ద్వారా విజ‌యం సాధించింది. చివ‌రి ఓవ‌ర్‌లో బంగ్లాదేశ్ విజ‌యానికి 8 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. స్టెఫానీ టేల‌ర్ త‌న మూడ‌వ బంతికి ఫ‌రీహా తృష్ణ‌ను బౌల్డ్ చేసి జ‌ట్టుకు ఉత్కంఠ విజ‌యాన్ని అందించింది. బంగ్లాదేశ్ జ‌ట్టు 136 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 10 ఓవ‌ర్ల‌లో 15 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టిన హేలీమాథ్యూస్ వెస్టిండీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది. ఆమె కెరీర్‌లోనే ఇదే అత్తత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం.

Ads

ఆమెకు తోడు కెప్టెన్ స్టెఫానీ టేల‌ర్ 29 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టింది. అమీ ప్లెచ‌ర్ 3 వికెట్లు తీసింది. వెస్టిండిస్ త‌రుపున ష‌మ‌నే క్యాంప్‌బెల్ అత్య‌ధికంగా 53 ప‌రుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 18, డియాండ్రా డాటిన్ 17 ప‌రుగులు సాధించింది. 9వ స్థానంలో బ్యాటింగ్ వ‌చ్చి ఎఫీ ఫ్లెచ‌ర్ కూడా 17 ప‌రుగుల స‌హ‌కారం అందించింది. కేవ‌లం 140 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం అంత‌గా క‌లిసి రాలేదు. వికెట్ కీప‌ర్ ష‌మీమా సుల్తానా డ‌కౌట్ అయింది.

ష‌ర్మీన్ అక్త‌ర్‌, ఫ‌ర్గానా హ‌క్ మంచి భాగ‌స్వామ్యాన్ని నిర్మించేందుకు ప్ర‌య‌త్నించారు. హేలీ మ్యాథ్యూస్ బౌలింగ్‌లో పెవిలియ‌న్ చేరారు. కెప్ఠెన్ నిగ‌ర్ సుల్తానా 77 బంతుల‌తో పాటు క్రీజులో గ‌డిపిన‌ప్ప‌టికీ ఆమె కూడా హేలీ మాథ్యూస్‌కు బ‌లైంది. ఇద్ద‌రు బ్యాట‌ర్లు డ‌కౌట్ కావ‌డంతో బంగ్లాకు ఎదురుదెబ్బ త‌గిలింది. న‌హిదా అక్త‌ర్ చివ‌రి వ‌ర‌కు క్రీజులో కొన‌సాగిన‌ప్ప‌టికీ 25 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయింది. మూడ‌వ విజ‌యం సాధించి వెస్టిండీస్ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో మూడ‌వ‌స్థానానికి చేరుకున్న‌ది. ఆస్ట్రేలియా తొలి, ద‌క్షిణాఫ్రికా రెండ‌వ, వెస్టిండిస్ మూడ‌వ‌, భార‌త్ నాలుగ‌వ స్థానాల్లో ఉన్నాయి.


You may also like