తమిళ హీరో ధనుష్ హీరోగా వయొలెండ్ దర్శకుడు మతేశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ లు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ మూవీ జనవరి 12న తమిళంలో విడుదలైంది. తెలుగులో 4 సినిమాలు విడుదల కావడంతో థియేటర్లు దొరక్క రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సినిమా : కెప్టెన్ మిల్లర్
నటీ నటులు : ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, నివేదిత సతీష్ తదితరులు
ఛాయాగ్రహణం : సిద్దార్థ్ నూని
రచన : అరుణ్ మతీశ్వరన్, మదన్ కార్కీ
సంగీతం : జీవి ప్రకాశ్ కుమార్
నిర్మాణ సంస్థ : సత్య జ్యోతి ఫిలిమ్స్
దర్శకత్వం : అరుణ్ మతీశ్వరన్
విడుదల తేదీ: జనవరి 26, 2024
కథ మరియు విశ్లేషణ :
1930 లో బ్రిటీషు పాలనలో అగ్నీశ్వర(ధనుష్) తమిళనాడులోని ఓ గ్రామంలో ఉంటాడు. సొంత గ్రామంలో కుల వివక్ష కారణంగా అగ్నీశ్వర సైన్యం చేరుతాడు. సైన్యంలో అతడికి మిల్లర్ అనే పేరు పెడతారు. ట్రైనింగ్ పూర్తయిన తరువాత మొదటి అసైన్ మెంట్ సమయంలో తన పై అధికారిని చంపేస్తాడు. అప్పుడు అగ్నీశ్వర తప్పించుకోవడానికి తన తోటి సైనికుడు రఫిక్ (సందీప్ కిషన్) సహాయం చేస్తాడు. అక్కడి నుంచి వచ్చాక మిల్లర్ దొంగగా మారతాడు. తన ఊరి గుడిలోని విగ్రహాన్ని మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది..? ఈ కథలో భానుమతి (ప్రియాంక అరుల్ మోహన్), అగ్నీశ్వర అన్న శివన్న (శివరాజ్ కుమార్) పాత్రలు ఏంటి ..? అసలు గుడిలో ఉన్న విగ్రహం ఎవరిది..? అనేది తెలియాలంటే ఈ సినిమాని వీక్షించాల్సిందే.
Advertisement
ఇక సినిమా ఫస్టాప్ అంతా అగ్నీశ్వర లైఫ్ ను చూపించడంలోనే సరిపోతుంది. ఇంటర్వెల్ కి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆర్మీలో చేరాక సందీప్ కిషన్, ధనుష్, అబ్దూల్ లీల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ధనుష్ ఆర్మీ నుంచి పారిపోయాక ఇంటర్వెల్ వరకు కథ స్లోగా సాగుతుంది. విగ్రహం దొంగతనం నుంచి సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది. ముఖ్యంగా ధనుష్ తన గ్రామానికి మొదటి సారి వచ్చినప్పుడు భారీ యాక్షన్ సీన్, క్లైమాక్స్ లో సాగే ఫైట్ సీక్వెన్స్ లు సినిమాకే హైలెట్. కెప్టెన్ మిల్లర్ అనేది కేవలం వయోలెన్స్ తో కూడిన స్టోరీ మాత్రమే కాదు.. స్వాతంత్య్రం అంటే ఏంటి అనే దానికి నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకుటుంబంలో పుట్టిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఇంటి నుంచి పారిపోయి స్వాతంత్ర కోసం పోరాడే అమ్మాయిగా ఆకట్టుకుంది. 1930 నాటి పరిస్థితులను సినిమాటోగ్రాఫర్ సిద్దార్థ్ నూనికే ఇవ్వాలి. జీవీ ప్రకాశ్ కుమార్ కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఫస్టాప్ కాస్త నిడివి చూసుకొని ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది.
పాజిటివ్ పాయింట్స్ :
- ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ నటన
- దర్శకత్వం
- సంగీతం
- యాక్షన్ సీన్స్
నెగిటివ్ పాయింట్స్ :
- ఫస్టాప్ కాస్త స్లోగా సాగడం
- కాస్త బ్యాక్ గ్రౌండ్ స్కోరు మిస్
- స్క్రీన్ ప్లే
రేటింగ్ 2.75 / 5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!