ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నిత్యం దీపం పెడుతూ ఉండాలి. రోజు పూజ చేస్తూ ఉండాలి. అయితే రోజులో ఎన్నో పనులు ఉంటాయి. ఉదయాన్నే హడావిడి ఎక్కువ ఉంటుంది అందుకని ఆడవాళ్లు నైటీలు లేదంటే వేరే దుస్తులు వేసుకుని పూజ చేస్తూ ఉంటారు.
Advertisement
అలా పూజ చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎప్పుడూ కూడా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ప్రతి దానికి ఎలా అయితే కొన్ని నియమాలు ఉంటాయో పూజ విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. జుట్టు వదిలేసుకుని నైటీ తో అలా పూజ చేయడం మంచిది కాదు.
Advertisement
చాలామంది ఆడవాళ్లు ఈ మధ్యకాలంలో ఈ పొరపాటు చేస్తున్నారు. పురుషులు పూజ చేసేటప్పుడు పంచె లేదా లుంగీని వేసుకుని పైన కండువా లేదా తువ్వాలు కప్పుకుని నుదుట బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది. ఆడవాళ్ళు అయితే చీర కట్టుకుని పూజ చేయాలి. ఒకవేళ కనుక రోజూ చీర కట్టుకోలేము అనుకునే వాళ్ళు డ్రెస్ వేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు. అంతేకానీ మరీ నైటీతో పూజ చేసుకోవడం మంచిది కాదు. స్త్రీ సుహాసినిగా పూజ చేసుకోవాలి. చేతులకి గాజులు, నుదుట బొట్టు పెట్టుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకుని పూజ చేసుకుంటే మంచిది. అంతేకానీ రోజు నైటీ కంఫర్ట్ గా ఉందని పూజ మాత్రం అలా చేయొద్దు. ఎప్పటికైనా ఇది కష్టాన్ని తీసుకువస్తుంది అని పండితులు చెప్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!