మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు చిరంజీవి. అయితే చిరంజీవి సాధించిన రికార్డును ఈ జనరేషన్లో బ్రేక్ చేసిన హీరో లేనట్టేనా..? ప్రస్తుత కాలంలో చాలా మంది స్టార్ హీరోలు జీవిత కాలం లో 50 సినిమాలు చేస్తే గ్రేట్ అనే పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ల సమయాన్ని కేటాయిస్తున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. సినిమాల్లో ఎంత వేగంగా నటించినా హీరోలు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసి సినిమా ని రిలీజ్ చేస్తున్నారు. ఏడదికి ఒక్క సినిమా రిలీజ్ చేస్తే చాలు అన్న విధంగా మారిపోయింది.
Advertisement
Advertisement
ఈ జనరేషన్లో 150 కి పైగా సినిమాల్లో నటించిన హీరో చిరంజీవి. అయితే ఈ రికార్డుని బ్రేక్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేరు. చిరంజీవి తొలినాళ్ళల్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు నటించడం వలన ఈ రికార్డు వచ్చింది. అప్పట్లో హీరోలు నెలకి ఒక సినిమా షూటింగ్ని పూర్తి చేసేవారట.
అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. చిరంజీవి ఆ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. 60 నుండి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఫ్యాన్స్ కి దగ్గరవుతున్నారు చిరు. విశ్వంబర సినిమాతో చిరంజీవి హిట్ కొట్టాలని చిరు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు మరి చిరంజీవి ఖాతాలో హిట్ పడుతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!