Home » సీన్ బాగా రావ‌డంకోసం ప్రాణాలు కోల్పోయిన చిరంజీవికి ఇష్ట‌మైన కెమెరామెన్! ఆ రోజు ఎం జ‌రిగిందంటే?

సీన్ బాగా రావ‌డంకోసం ప్రాణాలు కోల్పోయిన చిరంజీవికి ఇష్ట‌మైన కెమెరామెన్! ఆ రోజు ఎం జ‌రిగిందంటే?

by Azhar
Ad

లోక్ సింగ్ చిరంజీవికి చాలా ఇష్ట‌మైన సినిమాటోగ్రాఫ‌ర్., చిరును మాస్ హీరోగా ఎలివేట్ చేసిన సినిమా అయిన యమకింకరుడు మొద‌లు మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, పసివాడి ప్రాణంలాంటి ఎన్నో హిట్ సినిమాల‌కు లోక్ సింగ్ యే కెమెరామెన్ గా ప‌నిచేశాడు.లోక్ సింగ్ కు డెడికేష‌న్ ఎక్కువ‌…షాట్ త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ‌చ్చేదాకా పట్టుప‌డ‌తాడు. అందుకే చాలా మంది డైరెక్ట‌ర్ల‌కు ఇత‌నంటే చాలా ఇష్టం. ఈ డెడికేష‌న్ యే లోక్ సింగ్ ప్రాణాలు తీసింది.

Advertisement

చిరు సినిమాలో ఇలా :
అల్లు అరవింద్ నిర్మాత‌గా విజ‌య‌బాపినీడు డైరెక్ష‌న్ లో చిరంజీవి హీరోగా హీరో అనే సినిమాల షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ సీన్ లో చిరంజీవి మీదకు విలన్స్ లారీతో దాడి చేయాలి. కానీ ఆ డ్రైవ‌ర్ త‌న‌కు షాట్ కు కావాల్సిన రీతిలో డ్రైవ్ చేయడం లేదని చిరాకు పడ్డ లోక్ సింగ్ కెమేరా అసిస్టెంట్ కి ఇచ్చి…తనే వెళ్లి లారీ డ్రైవ్ చేశాడు.

Advertisement

మ‌రోసారి ఇలాగే…. :

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన కొడుకు భరత్ ను హీరోగా పెట్టి వార్నింగ్ అనే సినిమా తీశారు ఈ సినిమాకు లోక్ సింగ్ యే కెమెరా మెన్! ఈ సినిమాలోని ఓ పాట కోసం హీరోయిన్ ఆమని మంటల మధ్య డాన్స్ చేయాలి… ఆ మంటల కోసం ఓ కుర్రాడు పెట్రోలు పోస్తున్నాడు. తను అనుకున్నట్టు మంటలు రావడం లేదని లోక్ సింగ్ అసహనానికి గురై…తనే వెళ్లి మంటల మీద పెట్రోలు పోశాడు. అలా పెట్రోలు పోయడంలో తను వేసుకున్న ఫుల్ హాండ్స్ షర్ట్ పెట్రోల్ తో తడిసి దానికి మంట‌లంటుకున్నాయి. అందరు చూస్తుండగానే కెమెరా మెన్ లోక్ సింగ్ మంటల్లో ఆహుతైపోయాడు.

Visitors Are Also Reading