హీరో సుమన్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ఆయన తన నటన తో పాటుగా మార్షల్ ఆర్ట్స్ లో కూడా పట్టు సాధించి అలాంటి సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్లో మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన కల్పించిన గొప్ప హీరో అని చెప్పవచ్చు. ఆయన సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.
Advertisement
ఒకానొక సమయంలో జైలుకు కూడా వెళ్లారు. అంతటి పేరు సంపాదించిన సుమన్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. అవేంటో చూద్దాం..! సినిమా అంటేనే ఒక రంగుల మాయ ప్రపంచం. ఇందులో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండకపోతే ఏదో రకంగా కింద పడిపోతాం. మనల్ని తొక్కేయాలని ఎందరో వ్యక్తులు కూడా వేచి చూస్తూ ఉంటారు. సినీరంగంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే గొప్ప వెలుగు వెలిగి తర్వాత తొందరలోనే ఆరిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ జయాపజయాలను తట్టుకొని నిలబడ్డ వారు ఉన్నారు.
ఇందులో ముఖ్యంగా సుమన్ గురించి చెప్పుకోవాలంటే ఆయన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని ముఖ్యంగా అమ్మాయిల గుండెల్లో ఒక కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ చాలా మందికి ఆయన పూర్తి పేరు ఏంటో తెలియదు. అసలు పేరు సుమన్ తల్వార్. మాతృభాష కూడా తెలుగు కాదు. అయినా సుమన్ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. అందుకే తెలుగు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారని చెప్పవచ్చు. సినీనటుడు కాకముందు సినిమా అవకాశాల కోసం చాలా తిరిగేవాడు. ఆయనకు హీరో భానుచందర్ తో మంచి స్నేహం ఉంది. వీరిద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. కానీ ముందుగా సినిమాల్లోకి వచ్చింది మాత్రం భానుచందర్. తర్వాత ఆయన రికమెండేషన్ తో సుమన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాల్లో ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ ని వాడారు.
Advertisement
సుమన్ గారు తరంగిణి, దేశంలో దొంగలు పడ్డారు సినిమాల్లో నటించారు. కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో సుమన్ సినిమాలు పోటీ పడ్డాయి. ఇలా మంచి క్రేజ్ లో ఉన్న సమయంలో సుమన్ కు దెబ్బ పడింది. నీలిచిత్రాల కేసులో జైలుకు వెళ్లారు. బెయిల్ కూడా రాకపోవడంతో చాలా కాలం జైల్లోనే ఉన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా షాక్ లోకి వెళ్ళింది. ఎలాగొలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో పరువు పోయిందని డిప్రెషన్ లోకి వెళ్లారు సుమన్. ఇదే సమయంలో వివాహం అనే బంధంతో శిరీష రూపంలో అదృష్టం తలుపు తట్టింది.
ఆ తర్వాత కారు దిద్దిన కాపురం, గుండమ్మ కథ, రాముడు భీముడు, యమగోల వంటి సూపర్ హిట్ సినిమాల్లో కథలను అందించినటువంటి డి.వి.నరసరాజు గారు తన మనవరాలు శిరీషను సుమన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రముఖ రచయిత తన మనవరాలిని సుమన్ కి ఇవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సుమన్ తప్పు చేసి ఉంటే రాజుగారు స్వయంగా ఎందుకు తన మనవరాల్ని ఇచ్చి వివాహం చేస్తారని అందరూ అనుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సుమన్ గారు సెకండ్ ఇన్నింగ్స్ చాలా గట్టిగా మొదలు పెట్టారు. చిన్నల్లుడు పెద్దింటి అల్లుడు, పరువు ప్రతిష్ట, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి :
ఈ 6 స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లు…!
BEAST REVIEW : విజయ్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!