Butter Milk: వేసవికాలంలో ఉక్క పోత ఎండ తీవ్రత వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేసవికాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలానే ఒంట్లో వేడి తగ్గడానికి చల్లటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. చలువ చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది వేడి బాగా తగ్గుతుంది. వేసవికాలం మొదలైపోయింది కాబట్టి రోజు కచ్చితంగా మజ్జిగ తాగడం మొదలు పెట్టండి. మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఎండాకాలమే కాదు ప్రతిరోజు కూడా ఒక గ్లాసు మజ్జిగ తాగడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వేసవిలో మజ్జిగ తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
Advertisement
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే విటమిన్స్ ఖనిజాలు మినరల్స్ వ్యాధులతో పోరాడగలవు. మజ్జిగ తాగడం వలన ఎముకలు బలంగా దృఢంగా మారిపోతాయి శరీరాన్ని హైడ్రేట్ గా మజ్జిగ ఉంచుతుంది. క్యాలరీలు ఇందులో తక్కువ ఉంటాయి బరువు తగ్గడానికి కూడా అవుతుంది. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. చర్మాన్ని సాఫ్ట్ గా కాంతివంతంగా మార్చేటట్టు చూస్తుంది.
Advertisement
Also read:
Also read:
వేసవికాలంలో మలబద్ధకం జీర్ణ సమస్యలు కూడా మజ్జిగ తీసుకోవడం వలన తొలగిపోతాయి. ఉదర సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఎండాకాలంలో నీరసం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సమయంలో మజ్జిగ తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది ఎనర్జీ లెవెల్స్ వెంటనే పెరిగిపోతాయి. శరీరం కూడా కూల్ అయిపోతుంది. వేడి బాగా తగ్గిపోతుంది పిల్లలు పెద్దలు కూడా వేసవికాలంలో మజ్జిగను తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా మజ్జిగ తీసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి కావాలంటే ఈసారి మీరు కూడా ట్రై చేయండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!