Home » బన్నీ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?

బన్నీ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు అవకాశాలు దక్కించుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండస్ట్రీలో అందం అదృష్టం రెండు ఉంటేనే వరుస ఆఫర్లు వస్తాయి. ఒకటి రెండు ఫ్లాపులు పడ్డాయి అంటే ఆ తర్వాత హీరోయిన్ క‌నుమరుగు అవ్వాల్సిందే. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాల్సిందే… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం ఇష్టం లేని హీరోయిన్లు సినిమాలకు దూరమై పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిలైపోతుంటారు.

Advertisement

అలా సినిమాలకు దూరమైన హీరోయిన్లలో బ‌న్ని సినిమా హీరోయిన్ గౌరీ మంజల్ కూడా ఒకరు. అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాతో గౌరీ మంజల్ హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే స్టార్ట్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని గౌరీ మంజుల్ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మ‌ల‌యాళ‌ చిత్రాలలోనూ గౌరీ మంజుల్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

బ‌న్నీ సినిమాతో పాటు తెలుగులో శ్రీకృష్ణ 2006, బంగారు బాబు, గోపి గోడ మీద పిల్లి లాంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఆ తర్వాత ఆశించిన‌మేర‌ అవకాశాలు దక్కలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి గౌరీ మంజల్ పూర్తిగా దూరమైంది. అయితే బన్నీ సినిమాతోనే గౌరీ మంజ‌ల్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.

ఆమె అందం అభినయం నటన చూసి ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరమైనా గౌరీ మంజల్ ఎలా ఉంది ఏం చేస్తుంది అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇక‌ గౌరీ మంజ‌ల్ ప్రస్తుతం సినిమాలకు దూరం అవడంతో వ్యాపారాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన కుటుంబంతో కలిసి గౌరీ మంజల్ ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు సమాచారం.

Visitors Are Also Reading