Home » మ‌హేశ్ బాబు స‌హా బుల్లెట్ భాస్క‌ర్ ఎవ‌రెవ‌రికి డ‌బ్బింగ్ చెబుతారో తెలుసా…!

మ‌హేశ్ బాబు స‌హా బుల్లెట్ భాస్క‌ర్ ఎవ‌రెవ‌రికి డ‌బ్బింగ్ చెబుతారో తెలుసా…!

by AJAY
Ad

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు బుల్లెట్ భాస్కర్. త‌న స్కిట్ ల‌తో బుల్లెట్ భాస్క‌ర్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే బుల్లెట్ భాస్క‌ర్ స్కిట్ లు చేయ‌డంతో పాటూ మిమిక్రీ కూడా చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా మ‌హేశ్ బాబు వాయిస్ ను బుల్లెట్ భాస్క‌ర్ అచ్చుగుద్దిన‌ట్టు చెబుతూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బుల్లెట్ భాస్క‌ర్ కేవ‌లం టీవీ షోల‌లో మాత్రమే కాకుండా మ‌హేశ్ బాబు సినిమాల‌కు మ‌రియు మ‌హేశ్ బాబు న‌టించే యాడ్స్ కు కూడా డ‌బ్బింగ్ చెబుతార‌న్న సంగ‌తి మాత్రం చాలా త‌క్కువ మందికి తెలుసు ఈ విష‌యాన్ని బుల్లెట్ భాస్క‌ర్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

Advertisement

మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన నంబ‌ర్ 1 సినిమాకు పూర్తిగా తానే డబ్బింగ్ చెప్పాన‌ని అన్నారు. మహేశ్ బాబు త‌న భార్య స‌మాధి వ‌ద్ద ఏడ్చే సీన్ లో ఆయ‌న యాక్టింగ్ చూసి తాను కూడా క‌న్నీళ్లు పెట్టుకున్నాన‌ని అన్నారు. అంతే కాకుండా స‌ర్కారు వారి పాట సినిమాకు కూడా త‌న‌ను డ‌బ్బింగ్ చెప్ప‌మ‌ని అడిగార‌ని అన్నారు. కానీ త‌న‌కు ఆ డేట్స్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల వెళ్ల‌లేక‌పోయాన‌ని చెప్పారు.

Advertisement

మ‌హేశ్ బాబు చాలా చిన్న‌గా మాట్లాడ‌తార‌ని ఆయ‌న మాట్లాడితే ప‌క్క వాళ్ల‌కు కూడా విన‌ప‌డద‌ని బుల్లెట్ భాస్క‌ర్ తెలిపారు. ఇక తను మహేశ్ బాబు ను ఒకేసారి క‌లిసి ఫోటో దిగాన‌ని అన్నారు. త‌ను మ‌హేశ్ బాబు కు డ‌బ్బింగ్ చెబుతాన‌ని ఆయ‌న‌కు తెలుస‌ని చెప్పారు.

ALSO READ : మోహ‌న్‌బాబు హిట్ సినిమాను జ‌య‌సుధ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?

మొద‌టి సినిమాల నుండి మ‌హేశ్ బాబు వాయిస్ మారుతూ వ‌చ్చింద‌ని అన్నారు. రాజ‌కుమారుడు సినిమాలో వాయిస్ వేరుగా ఉండేద‌ని ఇప్పుడు వేరుగా ఉంద‌ని చెప్పారు. త‌ను బ్ర‌హ్మానందం వాయిస్ చెప్ప‌లేన‌ని బాద‌ప‌డుతాన‌ని అన్నారు. ఎమ్మెస్ నారాయ‌ణ వాయిస్ చెప్ప‌గ‌ల‌న‌ని చెప్పారు. కొండ‌వ‌ల‌స వాయిస్ కూడా చెప్ప‌గ‌ల‌న‌ని అన్నారు. విల‌న్ రావు గోపాల్ రావు వాయిస్ ను కూడా చేయ‌గ‌ల‌న‌ని చెప్పారు.

Visitors Are Also Reading