Telugu News » Blog » ఏసీబీ అదుపులో బుల్లెట్ బండి ఫేమ్ భ‌ర్త‌…? కార‌ణం ఇదే..?

ఏసీబీ అదుపులో బుల్లెట్ బండి ఫేమ్ భ‌ర్త‌…? కార‌ణం ఇదే..?

by AJAY
Ads

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ తో చాలా మంది ఓవ‌ర్ నైట్ సెల‌బ్రెటీలు అవుతున్నారు. రీసెంట్ గా బంగారం తిన్నావా అంటూ ఓ యువతి సోష‌ల్ మీడియాలో వీడియోల‌తో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఆ వీడియోలు వైర‌ల్ అవ్వ‌డంతో టీవీ షోల‌లో కూడా సంద‌డి చేస్తోంది. అప్ప‌ట్లో ఓ యువ‌కుడు త‌ప్ప‌తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. మీకు పోలీస్ స్పెల్లింగ్ వ‌చ్చా అంటూ పోలీసుల‌నే నిల‌దీయ‌గా అత‌డి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Ads

ఇలా చెప్పుకుంటూ పోతే సోష‌ల్ మీడియా ద్వారా ఓవ‌ర్ నైట్ స్టార్ గా ఎదిగిన‌వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక ఆ లిస్ట్ లోనే ఒక‌ప్పుడు త‌న పెళ్లికి స్టెప్పులు వేసి వైర‌ల్ అయిన యువ‌తి కూడా ఉంది. బుల్లెట్ బండెక్కి వ‌చ్చేస్తా వా అంటూ త‌న పెళ్లి భ‌ర‌త్ తో డ్యాన్స్ చేసిన యువ‌తి ఉద‌యం వ‌ర‌కూ త‌న‌కు తెలియ‌కుండానే సోష‌ల్ మీడియా స్టార్ అయిపోయింది.

Ads

ఆ త‌ర‌వాత ఎక్క‌డ చూసినా కూడా నెల రోజుల పాటూ యువ‌తి వీడియోనే క‌నిపించింది. ఆ రేంజ్ లో పాపులారిటీ రావ‌డంతో కొన్ని టీవీ షోల‌లో కూడా యువ‌తి సందడి చేసింది. ఇక ఇప్పుడు ఆ యువ‌తి గురించి ఎందుకు చెప్పుకుంటున్నార‌ని అనుకోవ‌చ్చు. అప్పుడు యువ‌తి అందంగా త‌న భ‌ర్త‌తో క‌లిలి స్టెప్పులు వేయ‌గా ఇప్పుడు ఆమె భ‌ర్త వ‌ల్ల వార్త‌ల్లో నిలిచింది.

Ad

ఆమె భ‌ర్త మాత్రం మంచి ప‌నిచేయ‌కుండా లంచం తీసుకుంటూ వార్త‌ల్లోకి ఎక్కాడు. హైద‌రాబాద్ లోని మున్సిప‌ల్ ఆఫీస్ లోనేడు ఉద‌యం ఏసీబీ దాడులు నిర్వ‌హించ‌గా బుల్లెట్ బండి పెళ్లి కూతురు భ‌ర్త‌ అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అశోక్ 30 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డగా అధికారులు అశోక్ ఇంట్లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు.