Home » జ‌గ‌న్నాథ గ‌ట్టుపై హైకోర్టు నిర్మించి తీరుతాం : మంత్రి బుగ్గ‌న

జ‌గ‌న్నాథ గ‌ట్టుపై హైకోర్టు నిర్మించి తీరుతాం : మంత్రి బుగ్గ‌న

by Anji
Ad

క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని అంద‌ని ద్రాక్ష‌లా మారింద‌నే ప్ర‌చారం కొన‌సాగుతుంది. ఈ స‌మ‌యంలో మంత్రి బుగ్గ‌న ఇంట్రెస్టెంగ్ కామెంట్స్ చేశారు. ఇటీవ‌ల హైకోర్టు తీర్పుతో రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు న్యాయ రాజ‌ధాని అంద‌ని ద్రాక్ష‌లా మారిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో క‌ర్నూలు వాసులకు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ భ‌రోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకాలు ఎదురైనా స‌రే క‌ర్నూలు జ‌గ‌న్నాథ గ‌ట్టుపై హైకోర్టు నిర్మించి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.


హైకోర్టు భ‌రోసాతో పాటు ఆ ప్రాంతంలోని నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ నిర్మాణం జ‌రుగుతుంద‌ని బుగ్గ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో బుగ్గ‌న కామెంట్స్ హాట్ టాఫిక్‌గా మారాయి. రాష్ట్రంలో మూడు రాజ‌ధానులను ఏర్పాటు చేయ‌డంతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌ని వైసీపీ ఎప్ప‌టి నుంచో పేర్కొంటుంది.

Advertisement

Advertisement

క‌ర్నూలు ప్రాంతం ద‌శాబ్దాలుగా పాల‌కుల నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని.. ఈ త‌రుణంలో ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం హైకోర్టు ఏర్పాటుకు ప్లాన్ చేసింద‌ని పేర్కొంటున్నారు వైసీపీ నేత‌లు. 2019లోనే మూడు రాజ‌ధానుల బిల్లు ప్ర‌వేశ‌పెట్టినా దీనిపై కొంద‌రూ కోర్టుల్లో కేసులు వేసారు. దీంతో క‌ర్నూలు న్యాయ రాజ‌ధాని ఏర్పాటుకు బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ దీనిపై ఆశ‌లు చిగురించేలా కామెంట్స్ చేసారు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌.

Also Read : ర‌స్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌.. పంజాబ్‌పై కోల్‌క‌తా ఘ‌న‌విజ‌యం

Visitors Are Also Reading