Home » రెస్టారెంట్ లో రెచ్చిపోయిన దున్న‌పోతు..!

రెస్టారెంట్ లో రెచ్చిపోయిన దున్న‌పోతు..!

by Anji
Ad

మామూలుగా రెస్టారెంట్‌కు సాధార‌ణ ప్ర‌జ‌లు లేదా ధ‌నికులు, వీఐపీలు వ‌స్తుంటారు. అప్పుడ‌ప్పుడు చిన్న వివాదాలు జ‌రుగుతూ ఉంటాయి. కానీ ఓ రెస్టారెంట్‌లో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి తృటిలో మృత్యువు ఒడి నుంచి త‌ప్పించుకున్నాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. చైనాలోని జిన్హువాలో ఒక రెస్టారెంట్ లోకి దున్న‌పోతు దూసుకొని వచ్చింది. అది వ‌చ్చిన స‌మ‌యంలో రెస్టారెంట్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులున్నారు.

buffalo attack: Video: म्हशीने रेस्तरॉमध्ये घुसून घातला राडा; समोर येणाऱ्या  प्रत्येकाला घेतलं शिंगावर - watch shocking video buffalo attack in  restaurant | Maharashtra Times

Advertisement

Advertisement

ఒక వ్య‌క్తి నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చిన దున్న ఆ వ్య‌క్తిని దాని కొమ్ముల‌తో గాల్లోకి ఎగ‌రేసి కుమ్మెసిన‌ది. ఈ దాడిలో ఆ వ్య‌క్తి ఏకంగా మృత్యువుతో పోరాడినంత ప‌ని అయి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప‌క్క‌నే ఉన్న మ‌రొక వ్య‌క్తి అత‌డిని కాపాడి వేరే గ‌దిలోకి తీసుకు వెళ్లాడు. ఇంత‌లో స్థానికులు అక్క‌డికి చేరుకుని గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అతని ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. ఆ రెస్టారెంట్‌లో దున్న చేసిన దాడి ఘ‌ట‌న సీసీ కెమెరాల‌లో రికార్డు అయింది. తూర్పు, చైనా న‌గ‌రం తైజౌలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల‌వుతోంది.

Visitors Are Also Reading