Home » జగన్ మళ్లీ సీఎం అయితే..ఏపీలో WWE పోటీలు ?

జగన్ మళ్లీ సీఎం అయితే..ఏపీలో WWE పోటీలు ?

by Bunty
Ad

టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆడుదాం ఆంధ్రా” పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని బుద్దా వెంకన్న ఫైర్‌ అయ్యారు. యువకులంతా వైసీపీకి పాడి కట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్ మళ్లీ సీఎం అయితే WWE పెడతారని…మూడేళ్ళ క్రితమే కొడాలి నాని కేసినో,అ*ల డ్యాన్సులు అడ్డు ఆడేందుకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

Advertisement

కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిన పిచ్చికుక్క అని… టీడీపీ సస్పెండ్ చేస్తే వైసీపీలోకి వెళ్ళాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు గానీ, టీడీపీ గానీ తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నారు. గాంధీ భవన్ దగ్గర టీడీపీ జెండాలు కనపడితే చంద్రబాబు కు ఏం సంబంధం? అని నిలదీశారు. ఎవరైనా చంద్రబాబు ను విమర్శిస్తే ఇకపై జగన్ ను విమర్శిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సీఎం జగన్‌ దేనని.. వైసీపీ వాళ్ళు కర్రలు, కత్తులు పడితే మేము కూడా అలాగే సమాధానం చెప్తామని హెచ్చరించారు.

చంద్రబాబుకు సత్తా ఉంది కాబట్టి ప్రధానులను కూడా తయారు చేసాడని తెలిపారు. తెలంగాణ ఎన్నికలు చూసి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వదిలి పారిపోయేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు… వైసీపీ నాయకులు దేశం వదిలి వెళ్ళిన లాక్కొచ్చి శిక్ష వేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తాను… నాకు సీటు ఇవ్వాలని చంద్రబాబు ను అడుగుతానన్నారు. బీసీ అభ్యర్థిగా ఇక్కడ నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉంది…ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందని వివరించారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

 

Visitors Are Also Reading