Home » ఎన్టీఆర్ ను వదిలేసి రామ్ చరణ్ వైపు బుచ్చిబాబు..!

ఎన్టీఆర్ ను వదిలేసి రామ్ చరణ్ వైపు బుచ్చిబాబు..!

by Azhar
Ad

దర్శకుడు సుకుమార్ శిష్యునిగా టాలీవుడ్ లోకి ఉప్పెన అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఇక తాను డైరెక్ట్ చేసిన మొదటి సినిమానే హిట్ కావడంతో బుచ్చిబాబు తన తర్వాతి సినిమా ఎవరితో తీస్తాడు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. ఆ సమయంలోనే బుచ్చిబాబు టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒక్కడైనా ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు అనే చెప్పాలి.

Advertisement

కానీ ఆ ఆనందం అనేది ఎన్నో రోజులు లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా తీయాలంటే.. అంతకంటే ముందే కొరటాల శివ అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా అనేది పూర్తి కావాలి. కానీ ఈ సినిమాలు అనేవి ఇంకా ప్రారంభం కానేలేదు. ఎన్టీఆర్, కొరటాల సినిమా షూటింగ్ అనేది వాయిదా పడుతూనే ఉంది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు రూట్ మార్చదు అని తెలుస్తుంది.

Advertisement

బుచ్చిబాబు తర్వాత రెండో సినిమా ఎన్టీఆర్ తో కాకుండా రామ్ చరణ్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత గౌతమ్ తిననురి సైరెక్షన్ లో చేయాలి. కాబట్టి ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ రెండు సినిమాల కంటే ముందే పూర్తవుతాయి కాబట్టి… రామ్ చరణ్ తో సినిమా కోసం ఓ కథను బుచ్చిబాబు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

Visitors Are Also Reading