Home » వామ్మో…బుచ్చి బాబు రెండో సినిమాకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా….?

వామ్మో…బుచ్చి బాబు రెండో సినిమాకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా….?

by AJAY
Ad

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించిన దర్శకుడు సుకుమార్. కేవలం ఒకే రకమైన సినిమాలను చేయకుండా విభిన్న చిత్రాలతో సుకుమార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాడు. పుష్ప బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే సుకుమార్ శిష్యులు కూడా ఒక్కొక్కరుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా సుకుమార్ కు చాలా మంది శిష్యులు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు బుచ్చిబాబు.

Advertisement

సుకుమార్ అసిస్టెంట్ గా బుచ్చిబాబు టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. మొదటి సినిమానే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఉప్పెన సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలోని పాటలు మరియు మేకింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమా కథలోని ట్విస్ట్ కు చాలా మంది అభిమానులు అయ్యారు.

Advertisement

చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. దాంతో బుచ్చిబాబు స్టార్ హీరోల కంట్లో పడ్డాడు. మొదట బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అంతేకాకుండా ఆ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ స్వింగ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శంకర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అలా ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ ను బుచ్చిబాబు తన కథతో మెప్పించాడు.

అంతేకాకుండా రెండవ సినిమాకే బుచ్చిబాబు భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమాకు గాను బుచ్చిబాబు 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రెండవ సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading