ప్రస్తుతం రీఛార్జ్ ధరలు పెరగడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నెట్ వర్క్ చూసినా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దాంతో కస్టమర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్ ను తీసుకువచ్చింది. కేవలం 197 రూపాయలకు ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 150 రోజుల కాలపరిమితితో పాటు 2జీబి హై స్పీడ్ డేటా లభిస్తుంది.
Advertisement
అంతేకాకుండా అపరిమిత ఉచిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్ లాంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ అన్ని సర్కిల్ లలోనూ అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే అపరిమిత కాల్స్ మరియు డేటా పై పరిమితులు ఉన్నాయి. రీచార్జ్ చేసుకున్నప్పటి నుండి 18 రోజుల పాటు మాత్రమే హై స్పీడ్ డేటా మరియు అపరిమిత ఉచిత కాల్స్ లభిస్తాయి. ఆ తర్వాత మిగతా ప్లాన్ మిగతా రోజుల్లో 40 kbps డేటా స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇన్కమింగ్ కాల్స్ మాత్రం వస్తుంటాయి.
Advertisement
Also read : బెజవాడ బెంజ్ సర్కిల్లో కాంప్లెక్స్ ఒక్కటే మిగిలింది… రాజేంద్ర ప్రసాద్ కష్టాలు..!
అవుట్ గోయింగ్ కాల్స్ కావాలి అనుకుంటే మాత్రం మళ్లీ టాప్ అప్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కానీ ప్లాన్ గడువు ఉన్నంతకాలం మెసేజ్ లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇతర నెట్వర్క్ లలో 199 రూపాయలకు 150 రోజుల ఇన్కమింగ్ కాల్స్ ఇచ్చే ప్లాన్స్ ఏవి అందుబాటులో లేవు. కాబట్టి రెండు సిమ్ లు వాడుతున్నవారు ఈ ప్లాన్ వేసుకుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 150 రోజులపాటు ఇన్కమింగ్ కాల్స్ ని పొందవచ్చు.