Home » Bro: “బ్రో” ఈవెంట్ లో పవన్ అలా మాట్లాడడానికి కారణం అయిన ఆ రూల్స్ ఏంటి?

Bro: “బ్రో” ఈవెంట్ లో పవన్ అలా మాట్లాడడానికి కారణం అయిన ఆ రూల్స్ ఏంటి?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

శుక్రవారం “బ్రో” సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దానికి కారణం ఆయన తమిళ చిత్ర పరిశ్రమ గురించి ప్రస్తావించడమే. తమిళ సినిమాలకు సంబంధించి పెట్టిన షరతుల గురించి విన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా పరిధులు పెట్టుకుంటే.. ఏ చిత్ర పరిశ్రమ ఎదగలేదనీ.. అందరిని అక్కున చేర్చుకుంది కాబట్టే తెలుగు పరిశ్రమ పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిందని పవన్ చెప్పుకొచ్చారు.

Advertisement

దీనితో.. తమిళనాట చిత్ర పరిశ్రమలో ఎలాంటి రూల్స్ పెట్టారు అన్న విషయమై సర్వత్రా చర్చ మొదలైంది. నటి, నాయకురాలు రోజా భర్త సెల్వమణి నేతృత్వం లోనే తమిళ చలన చిత్ర పరిశ్రమ కొన్ని రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్ట్ లనే తీసుకోవాలని, తమిళ సినిమాల షూటింగ్ ను తమిళనాడు పరిధిలోనే పూర్తి చేయాలనీ రూల్స్ తీసుకొచ్చారు. అత్యవసరం అయితే తప్ప తమిళనాడు, ఈ దేశం దాటి వెళ్లకూడదట.

Advertisement

షూటింగ్ అనుకున్న టైం ప్రకారం అనుకున్న బడ్జెట్ కి పూర్తి కాకపోతే.. నిర్మాత ఫిర్యాదు చేయవచ్చు. అలాగే.. సినిమా కథకు సంబంధించి దర్శకుడే కథకుడు అయితే… కథ పూర్తి బాధ్యత దర్శకుడిదే. నిర్మాతకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ చివరి రెండు రూల్స్ అందరికి ఆమోదయోగ్యమే అయినా.. కేవలం తమిళియన్స్ నే తీసుకోవాలి, తమిళనాడు లోనే షూటింగ్ జరుపుకోవాలి అన్న రూల్స్ కి మాత్రం తమిళనాడు లోనే వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

మరిన్ని..

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading