Home » ఆక‌ర్షిస్తున్న మ‌ల్లూస్టార్స్ ఫ్యామిలీ డ్రామా.. ‘బ్రో డాడీ’ ట్రైల‌ర్

ఆక‌ర్షిస్తున్న మ‌ల్లూస్టార్స్ ఫ్యామిలీ డ్రామా.. ‘బ్రో డాడీ’ ట్రైల‌ర్

by Anji
Ad

మ‌ల‌యాళ స్టార్ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ 2019 బ్లాక్ బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్‌తో ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌య్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడు వీరిద్ద‌రూ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండ‌వ చిత్రం బ్రోడాడీ తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసారు మూవీ మేక‌ర్స్‌. ఇక ఈ ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ట్టు అర్థం అవుతోంది. ట్రైల‌ర్‌లో మోహ‌న్‌లాల్‌, మీనా జంట‌గా పృథ్వీరాజ్ వారికొడుకు క‌న్పించారు.

ఆకట్టుకుంటున్న మల్లూ స్టార్స్ ఫ్యామిలీ డ్రామా… "బ్రో డాడీ" ట్రైలర్

Advertisement

Advertisement

మొద‌టి ఫ్రేమ్ నుంచి చివ‌రి ఫ్రేమ్ వ‌ర‌కు బ్రోడాడీ ట్రైల‌ర్‌లో ఉన్న వినోదాత్మ‌క స‌న్నివేశాలు ఈ కుటుంబ క‌థా చిత్రంపై ఆస‌క్తిని పెంచాయి. ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆశీర్వాద్ సినిమాస్ ద్వారా ఆంటోని పెరుంబ‌వూరు నిర్మించారు. మోహ‌న్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, మీనా, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, ఉన్ని ముకుంద‌న్‌, లాలూ అలెక్స్‌, ముర‌ళిగోపి, క‌నిహా, సౌబిన్, షాహిర్ వంటి స్టార్లు అంద‌రూ ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దీప‌క్ దేవ్ నేప‌థ్య సంగీతం అందిస్తుండగా.. అభినంద‌న్ రామానుజం సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. బ్రోడాడీ డైరెక్ట్ ఓటీటీకి సిద్ధం అవుతోంది. ఈ కామెడీ కేప‌ర్ జ‌న‌వ‌రి 26న డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్ర‌సారం కానున్న‌ది.

Visitors Are Also Reading