దేశ ప్రధాని భద్రతా విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. 1988 స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ ద్వారా ప్రధాని, మాజీ ప్రధానిల రక్షణ బాధ్యత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కి అప్పగించారు. SPG కమాండోలు ప్రధాని నివాసం వద్ద, ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో, ఇతర ప్రాంతాల పర్యటనల సమయంలో ప్రధానమంత్రికి భద్రతను అందిస్తారు.
మోడీ సెక్యురిటీ:
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కు Z+ కేటగిరి భద్రతనిస్తారు. ఈ కేటగిరీలో 55 మంది ప్రధానికి రక్షణగా ఉంటారు. ఇందులో 10 మంది NSG కమాండోలు కూడా ఉంటారు. లోకల్ పోలీస్ తప్పనిసరి.
సెక్యురిటీ చేతిలోని ఆ సూట్ కేస్ లో ఏముంటుంది?:
వాస్తవానికి ఇది సూట్ కేస్ కాదు. PM వంటి VIPలకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణనిచ్చే బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్! మూడు లేదా నాలుగు మడతల్లో ఉండే ఈ బ్రీఫ్ కేస్ ను అవసరమైన సమయంలో ఓపెన్ చేసి బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్ గా వాడతారు. అంతేకాకుండా ఈ సూట్ కేస్ లోఇంపార్టెంట్ పేపర్స్ తో పాటు పిస్టర్ పెట్టుకునే సీక్రెట్ ప్యాకెట్ కూడా ఉంటుంది!
బాడీగార్డ్స్ కు ఆ నల్ల కళ్లద్దాలు ఎందుకు?
VIPలకు రక్షణగా ఉండే బాడీగార్డ్స్ చాలా వరకు నల్ల కళ్లద్దాలనే ధరిస్తారు. వీరు చుట్టుపక్కల అంతటిని గమనిస్తుంటారు. వారు ఎవరిని గమనిస్తున్నారనే విషయం ఇతరులకు తెలియకుండా ఆ గ్లాస్ తో కవర్ చేస్తారు.