Telugu News » గురువారం పెళ్లి, షాపింగ్… శుక్రవారం డబ్బు నగలు తీసుకుని నవవధువు జంప్..!

గురువారం పెళ్లి, షాపింగ్… శుక్రవారం డబ్బు నగలు తీసుకుని నవవధువు జంప్..!

by AJAY
Ad

లేటు వయసులో వివాహం చేసుకున్న ఓ వ్యక్తికి పెళ్లి ఊహించని షాక్ ఇచ్చింది. సినిమా ను తలపించేలా పెళ్లి చేసుకుని ఆ తర్వాత నిండా ముంచేసి వెళ్ళిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. యాచారం కు చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. అయితే ఈ వయసులో దగ్గర్లో సంబంధాలు దొరకవని తన స్నేహితుని ద్వారా ఓ బ్రోకర్ ను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి సంబంధం సెట్ చేసేందుకు గానూ బ్రోకర్ లక్ష రూపాయలు వసూలు చేశాడు. విజయవాడ లో ఒక అమ్మాయి ఉందని పరిచయం చేశాడు.

Marriage

Advertisement

అంతే కాకుండా ఆ అమ్మాయికి ఎవరూ లేరని అనాథ అని చెప్పాడు. ఇద్దరికీ విజయవాడ లోని లాడ్జిలోనే వివాహం జరిపించారు. అనంతరం కొత్త పెళ్ళికూతురు తో కలిసి వరుడు యాదగిరి గుట్టకు వచ్చి వ్రతం చేసుకున్నాడు. ఆ తరవాత ఇద్దరూ కలిసి హైదరాబాద్ చేరుకుని షాపింగ్ చేశారు. కొత్త పెళ్లి కూతురుకు మూడు తులాల బంగారం రూ.40వేల దుస్తులను కొనిచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి యాచారం చేరుకున్నారు.

Advertisement

also read : ఆటో డ్రైవ‌ర్ గా మారిన బిగ్ బాస్ విన్న‌ర్…!

అదే రోజు కొత్త పెళ్ళికూతురు బీరువాలో బట్టలు సద్దుతున్నట్టుగా నటించి బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలను తీసుకుంది. వాటితోపాటు షాపింగ్ చేసిన మూడు తులాల బంగారం, దుస్తులను తన బ్యాగ్ లోకి మార్చుకుంది. అదేసమయంలో తనతోపాటు వచ్చిన మరో యువతి కార్ బుక్ చేసింది. భర్త కళ్ళు కప్పేందుకు తనకు తలనొప్పిగా ఉందని ఒక టాబ్లెట్ తీసుకువచ్చి ఇవ్వాలని కోరింది. దాంతో భర్త మెడికల్ షాప్ కు వెళ్ళగా ఇద్దరు కలిసి కారులో పరారయ్యారు. కాసేపు చుట్టుపక్కల వెతికిన భర్త తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇదంతా ఓ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Visitors Are Also Reading