Home » తెలంగాణ యువ‌త పందెంకోళ్ల పెంప‌కం.. ఆంధ్ర యువ‌త కొన‌డం

తెలంగాణ యువ‌త పందెంకోళ్ల పెంప‌కం.. ఆంధ్ర యువ‌త కొన‌డం

by Anji
Ad

సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే చాలు వారం రోజుల ముందే పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. పండుగ‌కు మ‌హిళ‌లు ఎంతో అందంగా ముగ్గులు వేసి గొబ్బెల‌ను పేర్చితే.. చిన్నారులు గాలిపటాల‌తో ఆడుతుంటారు. మ‌రొక‌వైపు గంగిరెద్దుల సంద‌డి. పండుగ‌కు రైతు పండించిన పంట ఇంటికి చేరుకోవ‌డంతో పూర్వ‌కాలం నుంచి సంక్రాంతి పండుగ‌ను ఎంతో సంద‌డిగా జ‌రుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో అయితే ఆ సంబ‌రాలే వేరు. త‌మిళ‌నాడులో సంక్రాంతికి జ‌ల్లిక‌ట్టు ఆడితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం కోడిపందెంలు వేస్తుంటారు.

Pandem Kollu: పల్లెల నుంచి పార్శిల్‌లో పట్టణాలకు పందెం కోళ్లు.. ఆన్‌లైన్‌లో  జోరుగా గిరాకీ..! | Pandem Kollu are moving from the countryside to the  cities in parcels .. Demand is high online ...

Advertisement

ఇక సంక్రాంతికి ఏపీలో జ‌రిగే వేల సంఖ్య‌లో కోళ్ల‌ను తెలంగాణ నుంచి త‌ర‌లిస్తూ ఉన్నారు. పందెం కోళ్ల‌కు మంచి డిమాండ్ ఉండ‌టంతో కొంద‌రూ ఆదాయాన్ని వ‌న‌రుగా మార్చుకుని తెలంగాణ‌లో పెంచి అమ్ముతున్నారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ఆంధ్రావారు ఉండే ఏరియాల్లో మాత్ర‌మే క‌నిపించే పందెం కోళ్లు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ హౌస్‌లు, తోట‌లు, చెల‌క‌ల్లో పెంచుతున్నారు. కేవ‌లం సంక్రాంతి పండుగ‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని పెంచి ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో పెంచిన కోళ్ల విక్ర‌యాలు, అడ్వాన్స్ బుకింగ్‌లు జ‌రుగుతున్నాయంటే డిమాండ్ ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

Vaartha Online Edition

హైద‌రాబాద్ సిటీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఇబ్రాహీంప‌ట్నం, మొయినాబాద్‌, చేవెళ్ల‌, షాద్‌న‌గ‌ర్‌, శంషాబాద్‌, కీస‌ర, శామీర్‌పేట‌, క‌డ్తాల్‌, సంగారెడ్డి, చౌద‌రిగూడెం, వ‌న‌స్థ‌లిపురం వంటి ప‌లు ప్రాంతాల్లో కోళ్ల ఫామ్‌లున్నాయి. వీటిమీద ఆధార‌ప‌డి దాదాపు 800 కుటుంబాలు జీవిస్తున్నాయి. కేవ‌లం సిటీనే కాకుండా క‌రీంన‌గ‌ర్‌, సంగారెడ్డి, యాదాద్రి, మంచిర్యాల‌, నిజామాబాద్‌, కామారెడ్డి వంటి ప‌లు జిల్లాల‌లో కూడా పందెం కోళ్ల‌ను పెంచుతున్నారు.

Advertisement

సంక్రాంతికి సిద్ధమవుతున్న పందెం కోళ్లు

హైద‌రాబాద్ పాత బ‌స్తీలో ఆస్లీ జాతి కోళ్ల‌ను పెంచ‌డానికి ఆస‌క్తి చూపుతుండ‌గా.. జిల్లాల‌లో సీత్వా, అబ్రాస్‌,డేగ‌, నెమ‌లి, జాతి కోళ్ల‌ను పెంచుతున్నారు. దాదాపుగా పందెం కోళ్ల‌లో 20 జాతులుండ‌డం విశేషం. ముఖ్యంగా కాకి, నెమ‌లి, డేగ, సీత్వా, అబ్రాస్‌, ఆస్లీ, ప‌చ్చ‌కాకి కోళ్ల‌కు డిమాండ్ విప‌రీతంగా ఉంటుంది. ఒక్కోకోడి ధ‌ర బ‌రువు, రంగు, ఎత్తును బ‌ట్టి రూ.10వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది. ఇటీవ‌ల క‌రీనగ‌ర్ జిల్లాలో ఓ పెంప‌కం దారుడి వ‌ద్ద 35వేల పాల‌సీత్వా జాతి కోళ్ల‌ను కొనుగోలు చేసిన‌ట్టు ఓ వ్య‌క్తి వెల్ల‌డించారు.

కోడి పందేలు: వ్యాపారంగా.. ఉపాధి మార్గంగా కోడి పుంజుల పెంపకం - BBC News  తెలుగు

పందెం కోళ్ల‌కు రాగులు, స‌జ్జ‌లు, బాదం, గుడ్డు, మ‌ట‌న్‌కీమా వంటి నాణ్య‌మైన ఫుడ్‌తో పాటు, ఆయిల్ మ‌సాజ్‌, ఆయుర్వేద మూలిక‌ల‌తో సామ్రాని, స్విమ్మింగ్‌, వాకింగ్ చేయిస్తుంటారు. కొంత మంది ప‌దేళ్ల నుంచి కోళ్ల‌ను పెంచుతుండ‌గా..మ‌రికొంద‌రూ రెండు, మూడేండ్ల కాలం నుంచి పెంచుతున్నారు. కేవ‌లం సంక్రాంతి పండుగ ముందే ఈ కోళ్లను ఆంధ్రా నుంచి వ‌చ్చి తీసుకెళ్లుతుంటారు. సంక్రాంతి పండుగ త‌రువాత ఈ కోళ్ల‌కు అస‌లు గిరాకీనే ఉండ‌ద‌ని పెంప‌కం దారులు పేర్కొంటున్నారు. ఏపీలో ఉన్న ధ‌ర కంటే ఇక్క‌డి కోళ్ల‌కు ధ‌ర కాస్త త‌క్కువే.. పైగా ఇక్క‌డ పెరిగిన కోళ్లు చాలా బ‌లంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎక్కువ శాతం యువ‌త‌నే కోళ్ల‌ను పెంచ‌డానికీ సిద్ధ‌మ‌వ్వ‌డం విశేషం.

Visitors Are Also Reading