Home » భార‌త్‌లో టెస్లా కార్ల ప్ర‌య‌త్నాల‌కు బ్రేక్‌..!

భార‌త్‌లో టెస్లా కార్ల ప్ర‌య‌త్నాల‌కు బ్రేక్‌..!

by Anji

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా భార‌త్‌లో అడుగుపెట్ట‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. దిగుమ‌తి సుంకాల‌పై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న వీడ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే భార‌త్‌లో టెస్లా కార్ల విక్ర‌యించే ప్ర‌ణాళిక‌కు విరామం ఇవ్వ‌నున్న‌ట్టు ఆ సంస్థ వెల్ల‌డించింది. టెస్లా కార్ల విక్ర‌యంపై ఏడాదిగా భార‌త ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ స‌ఫలం కాలేక‌పోయింది. దీంతో షోరూంలు, స‌ర్వీస్ సెంట‌ర్ల కోసం స్థ‌లాల అన్వేష‌ణ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకున్న‌ట్టు స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కార్ల త‌యారీని భార‌త్‌లో చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయ‌డం వ‌ల్ల అందుకు సిద్ధంగా లేని టెస్లా ఆ ప్ర‌య‌త్నాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.

టెస్లా ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ అమెరికా, చైనా దేశాల్లో ఉత్ప‌త్తిని చేస్తోంది. వీటిని భార‌త్‌లో దిగుమ‌తి చేసి విక్ర‌యించేందుకు గ‌త కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. తొలుత విదేశాల్లో త‌యారు అయిన కార్ల‌ను మాత్రమే భార‌త్‌లో విక్ర‌యిస్తామ‌ని.. ఆ త‌రువాత త‌యారీ యూనిట్‌ను స్థానికంగా నెల‌కొల్పుతామ‌ని టెస్లా చీఫ్ ఎల‌న్ మ‌స్క్ చెప్పారు. ఎల‌క్ట్రిక్ కార్ల దిగుమ‌తిపై ఉన్న సుంకాన్ని త‌గ్గించాల‌ని కోరుతున్నారు. మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్య‌త ఇస్తున్న భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఎల‌న్ మ‌స్క్ ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీక‌రించ‌లేదు. ఎల‌క్ట్రిక్ త‌యారీని భార‌త్‌లోనే చేప‌ట్టాల‌ని ప‌లు ద‌ఫాలుగా స్ప‌ష్టం చేయ‌డం వ‌ల్ల‌నే షోరూంలు, స‌ర్వీస్ సెంట‌ర్ల కోసం ఆయా న‌గ‌రాల్లో చేసిన ప్ర‌య‌త్నాల‌ను టెస్లా విర‌మించుకుంది.

ఇక వాస్త‌వానికి 2019లోనే టెస్లాను భార‌త విప‌ణిలోకి తీసుకురావాల‌ని ఎల‌న్ మస్క్ భావించారు. భార‌త్‌లో విద్యుత్ వాహ‌నాల దిగుమ‌తిపై 100 శాతం సుంకం ఉంద‌ని.. దీనిని త‌గ్గించాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. ఈ స‌మ‌యంలో ఇక్క‌డి ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు కొన్ని సవాళ్ల కార‌ణంగానే టెస్లా రాక ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఎల‌న్ మ‌స్క్ ట్వీట్ చేయ‌డం తీవ్ర దుమారానికి దారి తీసింది. మ‌స్క్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన భార‌త ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయ‌న ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టింది. భార‌త్‌లో టెస్లా కార్ల విక్ర‌యాల‌కు మ‌స్క్ చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో తాత్కాలికంగా ఈ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకునేందుకు మొగ్గు చూపిన‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : 

రైతుల‌కు శుభ‌వార్త‌.. ముంద‌స్తుగానే నైరుతి ఋతుప‌వ‌నాలు

పూర్ణ నా లవర్ అంటూ జబర్దస్త్ నరేష్ సంచలనం….ఆ ఫోటోలు బయట పెట్టడం తో అంతా షాక్…!

Visitors Are Also Reading