Home » బ్రహ్మంగారి కాలజ్ఞానం: 2023 జరిగేది ఇదేనట..!

బ్రహ్మంగారి కాలజ్ఞానం: 2023 జరిగేది ఇదేనట..!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన మానవ ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పినవి జరిగాయని చాలామంది నమ్ముతారు. దొంగ స్వాములు పుట్టుకొస్తారని, కరోనా లాంటి వైరస్ మనల్ని ఇబ్బంది పెడుతుందని అప్పుడే బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పిన విషయాల్లో ఇవి జరిగాయి. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో 2023లో జరిగేది కూడా చెప్పారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 2023 నుంచి2024 మధ్యలో సమాజంలో అనేక విలువలు దిగజారి పోతాయని ఆయన చెప్పారట. ముఖ్యంగా వివాహ కట్టుబాట్లు మరిచిపోయి, ఇతరుల వ్యామోహంలో పడి అ*మ సంబంధాలు పెట్టుకుంటారట.

Advertisement

అంతేకాకుండా డబ్బు కోసం మనిషి చావడానికి అయినా, చంపడానికైనా సిద్ధపడతారట. అంతేకాకుండా శ్రీశైలం దేవాలయం ఉత్తరాన కొండపై నుంచి రాళ్లు పడి ఇబ్బందులు ఏర్పడతాయట. జనాలు అనేక వ్యాధుల బారిన పడి కరోనా కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారట. ఇక 2025- 26 మధ్యకాలంలో భారతదేశంలో అనుకోని సంఘటనలు జరిగి ఒక అవతార పురుషుడు పుట్టి అందరిని సత్ప్రవర్తన వైపు మలిగేలా చేస్తారని అంటున్నారు. 2065 నాటికి ప్రపంచ జనాభా పడిపోతుందని చెప్పారు.

Advertisement

అంతేకాకుండా 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారట. మరి కాలజ్ఞానం అంటే నిజమేనా. ఆయన చెప్పిన వాటిలో ఇప్పటివరకు ఎన్ని జరిగాయి.. ప్రస్తుతం చెప్పేవి కూడా జరుగుతాయా.. అనేది అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న.. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ కాలంలో ఇలాంటి విషయాలను కొంతమంది నమ్ముతారు. మరి కొంతమంది కొట్టిపడేస్తారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

also read:అశ్విని నాచప్ప గుర్తుందా.. ఆమె కూతుర్లు ఎంత అందంగా ఉన్నారంటే..?

Visitors Are Also Reading