Home » మోహన్ బాబు గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన బ్రహ్మానందం..!!

మోహన్ బాబు గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన బ్రహ్మానందం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కమెడియన్లలో బ్రహ్మానందం గారికి మంచి గుర్తింపు ఉంది. బ్రహ్మానందం గారికి కమెడియన్ బ్రహ్మగా కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అలానే బ్రహ్మానందం గారు అప్పట్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమాలో ఉండేవారు. అంతేకాదు ఆయన లేకుండా ఒక సినిమా కూడా రాకపోయేది అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం గారు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు. అయితే అలాంటి బ్రహ్మానందం గారికి మోహన్ బాబు ఓ సినిమాలో అవకాశం రాకుండా చేశారట. మరి ఇంతకీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read:ఏఎన్ఆర్ చివరి రోజుల్లో అందర్నీ దూరం పెట్టడానికి కారణం..?

బ్రహ్మానందం గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఇటీవలే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బ్రహ్మానందం గారు మోహన్ బాబు గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించాను.కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో నటించలేదు. అంతేకాదు ఆయనతో కలిసి ఒక్కసారైనా సినిమాలో నటించాలని భావించాను. ఇక అలాంటి తరుణం లోనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నాకు ఎన్టీఆర్ గారితో నటించే అవకాశం వచ్చింది. కానీ మోహన్ బాబు ఆ టైంలో బ్రహ్మానందం గారు చాలా బిజీ ఆర్టిస్టు.

Advertisement

ఆయన మన సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేస్తారో లేదో.ఇలాంటి చిన్న పాత్రకి ఆయనను తీసుకోవడం ఎందుకు ఇంకా వేరే ఎవరినైనా తీసుకోండి అని చెప్పారు.కానీ ఆ టైంలో రాఘవేంద్రరావు లోపల సీనియర్ ఎన్టీఆర్ గారే ప్రవేశించి ఈ పాత్రకి బ్రహ్మానందం గారే సెట్ అవుతారని రాఘవేంద్రరావుతో సీనియర్ ఎన్టీఆర్ గారు అనిపించారని నాకు అనిపిస్తుంది.అందుకే నాకు ఆ సినిమాలో అవకాశం వచ్చిందని నేను భావిస్తాను. మేజర్ చంద్రకాంత్ సినిమాలో నేను రిక్షావాడీ పాత్రలో నటించాను. అలాగే ఆ రిక్షావాడు పాత్రకి ఒక మంచి డైలాగు ఉంటుంది. ఆ డైలాగ్ పేరున్నvఆర్టిస్టులు చెబితేనే దాన్ని అందరూ చూస్తారు అనే ఉద్దేశంతో రాఘవేంద్ర రావు గారు నన్ను ఆ సినిమాలో తీసుకున్నారు అంటూ బ్రహ్మానందం గారు ఆ విషయాన్ని వెల్లడించారు.

Also Read:పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి చిరంజీవి సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

 

Visitors Are Also Reading