Telugu News » బ్రహ్మానందం ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు ..? ఆయన మొత్తం ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా..!

బ్రహ్మానందం ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు ..? ఆయన మొత్తం ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా..!

by AJAY MADDIBOINA
Published: Last Updated on

టాలీవుడ్ నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం. తన కామెడీతో హాస్యబ్రహ్మ గా పేరు సంపాదించుకున్నారు. తక్కువ సమయంలో బ్రహ్మీ వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ఆయన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ప్రస్తుతం వయసురీత్యా బ్రహ్మానందం తక్కువ సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా ఆయన నవ్విస్తూనే ఉన్నారు. కేవలం బ్రహ్మానందం వల్లే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Ads
brahmanandam wife

brahmanandam

ఇక ప్రస్తుతం బ్రహ్మానందం అడపాదడపా సినిమాలు చేస్తూ మనవళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ వేస్తూ తనకు నచ్చిన వారికి గిఫ్ట్ గా ఇస్తున్నారు. కామెడీ లోనే కాకుండా పెయింటింగ్ లోనూ తానేమీ తక్కువ కాదని బ్రహ్మానందం ప్రూవ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే స్టార్డమ్ ఉన్న బ్రహ్మానందం రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది.

బ్రహ్మానందం ఎంత సంపాదించారు అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎంత సంపాదించారు ఒక సినిమాకు ఎంత తీసుకుంటారో చూద్దాం… బ్రహ్మానందం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. బ్రహ్మానందంకు తన సొంతూరు సత్తెనపల్లి లో ఐదు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తంగా బ్రహ్మానందం కు రూ. 350 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని సమాచారం. అంతేకాకుండా ఒక్కో సినిమాకు ఆయన కోటి నుండి రెండు కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటారని తెలుస్తోంది. అదేవిధంగా ఏడాదికి 25 కోట్ల వరకు సంపాదిస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

Also Read: RRR సినిమాలో అదిరిపోయే ట్విస్ట్‌..!


You may also like