Telugu News » Blog » బ్రహ్మానందం ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా…?

బ్రహ్మానందం ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా…?

by AJAY
Ads

బ్రహ్మానందం ఆయన పేరులోనే ఆనందం అనే పదం ఉంది. బ్రహ్మానందం సినిమాలో కనిపించారంటే అప్పటి వరకు ఎన్ని టెన్షన్ లు ఉన్నా మూడు గంటల పాటు నవ్వుతూ ఆనందంగా బయటకు వెళ్తారు. ప్రస్తుతం వయసు పై బడటం తో బ్రహ్మానందం కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేశారు.

Ads

హాస్యబ్రహ్మ గా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. బ్రహ్మానందం మొదట తొమ్మిదేళ్లపాటు లెక్చరర్ వృత్తిలో కొనసాగారు. తాతావతారం అనే సినిమాలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత బ్రహ్మానందం కు ఆహనాపెళ్ళంట సినిమాలో అవకాశం వచ్చింది.

Ad

Ads

ఈ సినిమాలో అరగుండు పాత్రలో నటించి ప్రేక్షకులను నవ్వించారు. బ్రహ్మానందం చేసిన పాత్రలలో అదుర్స్ సినిమాలో చారి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. అంతే కాకుండా జంబలకడి పంబ సినిమా లో కూడా బ్రహ్మానందం పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఒకటి రెండు అని చెప్పలేము కానీ చాలా సినిమాలు బ్రహ్మానందం వల్లే సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

brahmanandam wife

brahmanandam

అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కు లక్షల్లో రెమ్యూనరేషన్ పుచ్చుకునేవారు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ కోట్లలో ఉండేది. అలా చాలా కాలం పాటు బిజీగా ఉన్న బ్రహ్మానందం సినిమాల్లో 500 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం కొడుకు గౌతమ్ సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.