Home » బ్రహ్మానందం కామెడీలోనే కాదు ఆస్తుల్లో కూడా టాపే.. ఎన్ని కోట్లంటే..!!

బ్రహ్మానందం కామెడీలోనే కాదు ఆస్తుల్లో కూడా టాపే.. ఎన్ని కోట్లంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మగా పేరుపొందిన బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వందలాది చిత్రాల్లో నటించిన ఆయన సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం 67 సంవత్సరాలు ఉన్న బ్రహ్మానందం ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి బ్రహ్మానందం కామెడీ వల్లే హిట్ అయిన అనేక సినిమాలు ఉన్నాయి.. అలాంటి బ్రహ్మానందం చేసిన చిత్రాలకు గాను గిన్నిస్ రికార్డుకెక్కిన తొలి నటుడిగా చరిత్ర సృష్టించారు.

Advertisement

కేవలం ఒక కదలికలతోనే నవ్వించే హాస్యబ్రహ్మగా బిరుదు సంపాదించారు. ఇండస్ట్రీలో 31 సంవత్సరాలుగా చక్రం తిప్పుతున్న బ్రహ్మానందం దాదాపుగా 1200 చిత్రాల్లో నటించారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల తక్కువ సినిమాలు చేస్తున్నారు. అయితే అలాంటి ఈ హాస్యనటుడు సినిమాల ద్వారా బాగానే సంపాదించారట. ప్రస్తుతం ఆయన ఆస్తికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రహ్మానందం కు మొత్తం ఆస్తులు వందల కోట్లు ఉంటుందట.

Advertisement

స్థిరాచరాస్తులు మొత్తం కలిపి 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా కొట్లాది రూపాయల విలువచేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. జూబ్లీహిల్స్ లో లగ్జరీ ఇల్లు, కోట్లాది రూపాయల విలువ చేసే కార్లు ఉన్నాయట. ప్రస్తుతం ఆయన ఆస్తులకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా కామెడీ కాకుండా విరామ సమయంలో దేవుళ్ళ చిత్రాలను గీస్తూ వాటిని హీరో హీరోయిన్లకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న రంగ మార్తాండ చిత్రంలో చేస్తున్నారు.

also read:ఈ ఫోటోలో ఉన్న ఈ పాప.. ఒక క్రేజీ హీరోయిన్.. చిచ్చర పిడుగు..!!

Visitors Are Also Reading