Telugu News » Viral : ఏపీకి త‌రువాత సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బ్ర‌హ్మంగారు ముందే చెప్పారు..!

Viral : ఏపీకి త‌రువాత సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బ్ర‌హ్మంగారు ముందే చెప్పారు..!

by Anji
Published: Last Updated on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతున్నాయి. ఓ సంవ‌త్స‌రం త‌రువాత అక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న‌ప్ప‌టికి.. ఇప్ప‌టి నుంచే అన్ని పొలిటిక‌ల్ పార్టీలు త‌మ వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఏమాత్రం ఛాన్స్ దొరికినా వైసీపీని విమ‌ర్శించేందుకు జ‌న‌సేన సిద్ధంగా ఉంది.

Ads

ప‌వ‌న్‌ ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రొక వైపు రాజ‌కీయాల‌కు కావాల్సిన స‌మయాన్ని కేటాయిస్తున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ.. సీఎం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. రాబోయే ఎన్నిక‌లు ఏపీలో ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. ప్ర‌ధానంగా వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌వ‌చ్చ‌ని ఊహ‌గానాలు చెబుతున్నాయి. ఈ త‌రుణంలోనే సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో వైర‌ల్ అవుతోంది.

బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానంలో చెప్పిన విధంగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఎప్పుడో చెప్పిన‌ట్టు ఓ వార్త వైర‌లవుతోంది. బ్ర‌హ్మంగారు కాల‌జ్ఞానంలో ప్ర‌స్తుతం న‌డుస్తున్న రాజ‌కీయాల‌ను శ‌తాబ్దాల కింద‌టే అంచనా వేసారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఫోటో సారాంశం ఏమిటంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రి అవుతున్నాడ‌ని అర్థం. తెలుగు రాష్ట్రమున ప‌వ‌నుడొచ్చేన‌య‌.. రాజ‌వార‌స‌త్వం న‌శించిన‌య‌, ప్ర‌జారాజ్యం విర‌సిల్లున‌య‌.. త‌ప్ప‌దు నా మాట న‌మ్మండ‌య అని రాసి ఉన్న ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బ్ర‌హ్మంగారు చెప్పిన‌ట్టు ఆ ఫోటోలో రెండో లైన్‌లో రాజ‌వార‌స‌త్వం న‌శించున‌య అంటూ.. ఈ త‌ర‌హా రాజ‌కీయం ఇప్పుడు ఏపీలో న‌డుస్తుంది. వైఎస్సార్ వార‌సుడిగా జ‌గ‌న్ ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జ‌గ‌న్ ఓడిపోతే చంద్ర‌బాబు వార‌సుడిగా లోకేష్ నేనున్నా అంటూ ముందుకొస్తాడు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలో ఎవ్వ‌రు వ‌చ్చినా రాజుల కాలంలో మాదిరిగా వార‌స‌త్వ‌మే అవుతుంది. మొద‌టి లైన్‌లో చెప్పిన‌ట్టు వార‌స‌త్వాలు పోయి ప‌వ‌నుడు వ‌చ్చేన‌య అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ రావాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రాబోయే ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. క‌చ్చితంగా గెల‌వాల‌నే త‌ప‌న‌తో సీరియ‌స్‌గా ప‌ని చేస్తున్నారు. జ‌న‌సైనికులు ఈ సారి గెలుపు త‌మ‌దేనని ధీమాతో ఉన్నారు.


ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్యంగా నేను మీతో ఉన్నాను.. నాపై మీరు న‌మ్మ‌కం ఉంచండి. ఒక్క‌సారి జ‌న‌సేన వైపు చూడాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. మీ ఆశీర్వ‌చ‌నాలు నాకు ఇవ్వండి అని, పొత్తుల కోసం మాట్లాడే స‌మ‌యం కాదు. నా పొత్తులు జ‌నంతోనే అని, ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల త‌రువాత రోడ్ల‌పైకి వ‌స్తామ‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. మ‌రొక‌వైపు జ‌గ‌న్‌ను ఎలాగైనా గ‌ద్దె దించాల‌ని టీడీపీ కూడా ప్ర‌య‌త్నం చేస్తోంది. అవ‌స‌రం అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సీఎం సీటు ఇవ్వ‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అన్ని అనుకూలంగా క‌నిపిస్తున్నాయి. అన్ని కుదిరితే రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం వాస్త‌వం అవుతుందో లేదో తెలియాలంటే ఒక సంవ‌త్స‌ర కాలం పాటు ఎదురుచూడాల్సిందే.

Also Read : 

ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడిన వ్య‌క్తి.. కార‌ణం ఏం చెప్పాడంటే.?

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ ఆలోచ‌న‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి


You may also like