Home » బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి..? ఆ చరిత్ర తెలుసా..?

బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి..? ఆ చరిత్ర తెలుసా..?

by Bunty
Ad

ప్ర‌తీ ఏడాది డిసెంబ‌ర్ 26 వ‌చ్చిన‌ప్పుడు అల్లా క్రికెట్‌లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ల‌తో సంద‌డి నెల‌కొని ఉంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లు క్రిస్మ‌స్ మ‌రుస‌టి రోజు అన‌గా డిసెంబ‌ర్ 26 నుండే వ‌స్తుంటాయి. అయితే ప్రతీ ఏడాది డిసెంబ‌ర్ 26న టెస్ట్ మ్యాచ్‌లు ఆడే సంప్ర‌దాయం ఎప్ప‌టి నుంచి మొద‌లైంది, బాక్సింగ్ డే అంటే ఏమిటి..? అని ఎప్పుడైనా తెలుసుకున్నారా..? అయితే ఇప్పుడు ఆ బాక్సింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో నిర్వ‌హించే టెస్ట్ అత్యంత ప్ర‌సిద్ధ బాక్సింగ్ డే టెస్ట్ గా ప‌రిగ‌ణిస్తారు.

 

Advertisement

గ్రేట్ బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా, కెన‌డాతో స‌హా అన్నీ కామ‌న్‌వెల్త్ దేశాల్లో క్రిస్మ‌స్ త‌రువాత రోజును బాక్సింగ్ డే అని పిలుస్తుంటారు. ఇవాల్టి నుంచి ప్రారంభం అయ్యే టెస్ట్ మ్యాచ్‌ల‌ను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లంటారు. ఈసారి బాక్సింగ్ డే నుంచి రెండు మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఒక‌టి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న యాషెస్ సిరీస్ కాగా.. మ‌రొక‌టి సెంచూరియ‌న్ వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రెండ‌వ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Advertisement

 

తొలుత 1950లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మొద‌టిసారి అంత‌ర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు విన్న‌ర్‌గా నిలిచింది. తొలినాళ్ల‌లో అయితే ప్ర‌తీ సంవ‌త్స‌రం ఆడేవారు కాదు. 1952లో ద‌క్షిణాఫ్రికా త‌న మొద‌టి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడిన‌ది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ త‌రువాత బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ను 1968లో ఆడారు. ముఖ్యంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడే సంప్ర‌దాయం 1980 నుంచి ప్రారంభ‌మైన‌ది. అప్ప‌టి నుండి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు బాక్సింగ్ డే మ్యాచ్‌లు నిరంతరం ఆడుతున్నాయి. ఇక భార‌త్ అయితే త‌న మొద‌టి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ను 1985లో ఆడింది. అది డ్రాగా ముగిసిన‌ది. భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా 1992 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఐదు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి. ద‌క్షిణాఫ్రికా నాలుగు విజ‌యాలు సాధించింది.

also read :చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లి పెళ్లి వేడుక‌లో యానీ మాస్ట‌ర్ సంద‌డి..!

Visitors Are Also Reading