Home » చైతూ కు పోటీగా వస్తున్న సమంత…ఎవరు గెలుస్తారో ..!

చైతూ కు పోటీగా వస్తున్న సమంత…ఎవరు గెలుస్తారో ..!

by AJAY
Ad

టాలీవుడ్ సార్ హీరోయిన్ సమంత హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విడాకుల తర్వాత సమంత నాగచైతన్య ఫుల్ బిజీగా మారిపోయారు. సమంత తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉంది. మరోవైపు నాగచైతన్య కూడా తన బాలీవుడ్ డెబ్యూ కు సిద్ధమవుతున్నాడు.

samantha-akkineni

samantha-akkineni

ఇప్పటికే లవ్ స్టోరీ, బంగారాజు లాంటి సినిమాల తో వరుస హిట్లు అందుకున్నాడు. ఇక నాగచైతన్య నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈసినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించగా నాగ చైతన్య ఆర్మీ జవాన్ పాత్రలో సరికొత్త లుక్ లో నటించారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Advertisement

Samantha nagachaitanya

Samantha nagachaitanya

అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమా విడుదల కాబోతోంది. ఆగస్టు 12న సమంత యశోద తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంతకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. మరోవైపు డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలోనే యశోద పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మాజీ భార్య భర్తల మధ్య బాక్సాఫీస్ వద్ద పోటీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ రెండు సినిమాల్లో లో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading