మునిచ్ లోని బున్ డేస్ వేహ్రు ఇనిస్టిట్యూట్ ఆప్ మైక్రో బయాలజీ వారు చెప్పిన నివేదిక ప్రకారం బవేరియాలో ఒక వ్యక్తి మంకీ పాక్స్ బారిన పడ్డారు. ఈ సందర్భంగా జర్మనీలో శుక్రవారం రోజున మొదటి కేసు నిర్ధారించ బడింది. జర్మన్ ఆరోగ్య మంత్రి కార్లు లాటరు బాచ్ మాట్లాడుతూ దీనిపై చర్యలు తీసుకోకుంటే చాలా కష్టమని, త్వరితగతిన చర్యలు తీసుకుంటే అరికట్టగలం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
మంకీ ఫాక్స్ అంటే ఏమిటి…?
ఈ వైరస్ మొదటగా ఆఫ్రికాలో ఉద్భవించింది. దీన్ని ముందుగా కోతులలో గుర్తించారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ప్రకారం 1970 లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదటి మానవ కేసు గుర్తించబడింది. ఈ వైరస్ ప్రధానంగా రెండు జాతుల్లో ఉంటుంది. ఒకటి కాంగో జాతి, రెండోది పశ్చిమ ఆఫ్రికా జాతి. ఇందులో కాంగో జాతికి వ్యాధి సోకితే మరణాల రేటు పది శాతం వరకు ఉంటుంది. అలాగే ఆఫ్రికా జాతికి సోకితే మరణాల రేటు ఒక శాతం ఉంటుంది.
Advertisement
Advertisement
లక్షణాలు:
జ్వరం
తలనొప్పి
కండరాల నొప్పులు
అలసట
శోషరస కణుపులు ఉబ్బదం
ఈ వైరస్ గాలి బిందువుల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అలాగే శారీరక సంబంధం వల్ల కూడా సోకుతుంది.
also read;
అల్లుఅర్జున్ కు కట్నం ఎంత ఇచ్చారో మీకు తెలుసా..?
ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా..ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ ఇదేనా..?..హింట్ ఇదే..!