Telugu News » Blog » సీఎం జ‌గ‌న్ పై బాలీవుడ్ సింగ‌ర్ షాకింగ్ కామెంట్స్..చెరువులో క‌ప్ప అంటూ ఫైర్..!

సీఎం జ‌గ‌న్ పై బాలీవుడ్ సింగ‌ర్ షాకింగ్ కామెంట్స్..చెరువులో క‌ప్ప అంటూ ఫైర్..!

by AJAY
Ads

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. దాంతో ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ వేడుకల్లో సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి తో పాటు హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ లు మెరిశారు. ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అంతేకాకుండా పాటను తమ గొంతుతో పాడిన రాహుల్ సిప్లింగ‌జ్ మరియు కార్తికేయలు ఆస్కార్ ఈవెంట్ లో సందడి చేశారు.

Advertisement

ఎంతో ఉత్కంఠత మ‌ధ్య‌న‌ ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు లభించింది. దాంతో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు సెలబ్రిటీలు ఆస్కార్ రావడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Advertisement

అయితే ఈ ట్వీట్ పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ స‌మీ విమర్శలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ ను అభినందిస్తూ సీఎం చేసిన ట్వీట్ లో…. తెలుగు జెండా రెపరెపలాడుతోంది అంటూ జగన్ పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్ పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ ఓ చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప…. అంటూ విమర్శలు కురిపించారు. ఇక బాలీవుడ్ సింగర్ చేసిన కామెంట్లపై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తెలుగువారికి ద‌క్కిన గౌరవం అంటే బాలీవుడ్ వాళ్లు కుళ్లుకుంటున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Advertisement

ASLO READ :బాల‌య్య ఒక్క‌డే మా కుటుంబం…తార‌క‌ర‌త్న భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!