Home » జైల్లో ఉన్న ఆర్థిక నేరస్థుడిని కలిసేందుకు వెళ్లిన 12 మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు, మోడల్స్…!

జైల్లో ఉన్న ఆర్థిక నేరస్థుడిని కలిసేందుకు వెళ్లిన 12 మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు, మోడల్స్…!

by AJAY
Ad

ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సుకేష్ చంద్ర శేఖర్ రాన్ బాక్సి ప్రమోటర్లు అయిన శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తా అని చెప్పి వారి భార్యల నుండి రూ.200 కోట్లు తీసుకున్నాడు. దాంతో ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్టయ్యాడు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఖరీదైన కార్లు ఇచ్చాడని ఆరోపణలు రావడం తో సుకేష్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే తాజాగా ఈడీ దర్యాప్తులో సుకేశ్ గురించి సంచలన విషయాలు వెల్లడించినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

Advertisement

Advertisement

తీహార్ జైల్ లో సుకేష్ ను కలిసేందుకు 12 మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు మరియు మోడల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. వారిలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగానే జైల్లో తనకు నచ్చినట్టుగా ఉండేందుకు సుఖేష్ జైలు అధికారులకు నెలకు కోటి లంచంగా ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. జైల్లోని తన గదిలో విలాసవంతమైన సదుపాయాలు మొబైల్ ఫోన్ కోసం సిబ్బందిని మచ్చిక చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సుకేష్ జైలులో తనను అధికారులు వేధిస్తున్నారని జైలు అధికారులకు లేఖ రాసారు కూడా.

Visitors Are Also Reading