Home » భార్య‌ల‌కు విడాకులు…భ‌ర‌ణంగా కోట్లు! ఎవ‌రెంతిచ్చారంటే?

భార్య‌ల‌కు విడాకులు…భ‌ర‌ణంగా కోట్లు! ఎవ‌రెంతిచ్చారంటే?

by Azhar
Ad

సెలెబ్రిటీలు పెళ్ళి చేసుకున్నా, ఆ పెళ్ళి పెటాకులు చేసుకున్నా వార్త‌ల్లో అంశ‌మే! పెళ్లి, విడాకులు అనేది పూర్తిగా వారివారి వ్య‌క్తిగ‌త‌మే అయిన‌ప్ప‌టికీ…. విడాకుల త‌ర్వాత వారు త‌మ మాజీ భార్య‌ల‌కు ఇచ్చిన భ‌ర‌ణం చూస్తే ఔరా అనకుండా ఉండ‌లేము. మ‌రొక‌రిని మ‌నువాడ‌డానికి మాజీ భార్య‌ల‌కు కోట్ల‌లో భ‌ర‌ణాలిచ్చిన సెలెబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం!

ప్రభు దేవా: 25 కోట్లు
ప్రభుదేవా తన భార్య రమలతకు 2011లో విడాకులు ఇచ్చారు. భ‌ర‌ణంగా భార్య‌కు 25కోట్ల రూపాయలతో పాటు కొన్ని స్థ‌లాలు, ఖరీదైన కార్లు ఇచ్చార‌ట‌! న‌య‌న‌తార‌తో ల‌వ్ మ్యాట‌ర్ ఈ విడాకుల‌కు కార‌ణమైంది.

Advertisement

Photo Courtesy : Etimes

హృతిక్ రోషన్ : 50 కోట్లు
హృతిక్ 2000లో సుజాన్ ఖాన్ ను ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2014లో వీరు డైవ‌ర్స్ తీసుకున్నారు. విడాకుల త‌ర్వాత సుజాన్ ఖాన్ భ‌ర‌ణంగా 400 కోట్లు డిమాండ్ చేయ‌గా అది 50 కోట్ల‌కు ఫైన‌ల్ అయ్యింద‌ట‌!? వీరికి ఇద్దరు పిల్లలు

అమీర్ ఖాన్ : 10 కోట్లు
అమీర్ 1986లో రీనా దత్ ని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు.2000లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. రీనాకు భ‌ర‌ణంగా 10 కోట్లు ద‌క్కాయ‌ట‌! 2005లో అమీర్ కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వీరు కూడా విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Advertisement


సంజయ్ దత్ : 8 కోట్లు
భార్య మ‌ర‌ణం త‌ర్వాత సంజ‌య్ 1998లో రియా పిళ్ళై ని పెళ్లి చేసుకున్నాడు. 2008లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. రియాతో బ్రేకప్ త‌ర్వాత సంజ‌య్ మాన్య‌త‌ను పెళ్ళి చేసుకున్నాడు.


సంజయ్ కపూర్ : 80 కోట్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ క‌రిష్మా కపూర్ ను 2003లో పెళ్లిచేసుకున్నాడు. 2016లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కూతురు.


సైఫ్ అలీఖాన్ : 30 కోట్లు

సైఫ్ అలీఖాన్ 1991లో అమృత సింగ్ ను ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2004లో వీరిద్దరూ విడిపోయారు ఆ త‌ర్వాత 2012లో సైఫ్ క‌రీనా క‌పూర్ ను మ్యారేజ్ చేసుకున్నాడు.

Also Read: కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నమయ్య, రామదాసు చిత్రాల రచయిత కష్టాలు ..!


ఆదిత్య చోప్రా: 50 కోట్లు

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా 2000లో పాయల్ ఖన్నాను ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2009లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. అటు త‌ర్వాత 2014లో ఆదిత్య చోప్రా రాణి ముఖర్జీని పెళ్లిచేసుకున్నాడు.

Also Read: ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేప‌ర్ క‌టింగ్స్! ది బెస్ట్ క‌లెక్ష‌న్!

Visitors Are Also Reading