Home » పెళ్లి కూతురుగా మౌనీరాయ్‌.. ఫోటోలు వైర‌ల్‌..!

పెళ్లి కూతురుగా మౌనీరాయ్‌.. ఫోటోలు వైర‌ల్‌..!

by Anji
Ad

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ ఆమె ప్రియుడు సూర‌జ్ నంబియార్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రి ఈవెంట్ ఎంతో ట్రెడిషిన‌ల్‌గా.. ట్రెండీ జ‌రిగింది. గోవాలో మ‌ళ‌యాళ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల మ‌ధ్య గ్రాండ్ గా జ‌రిగింది. ఎప్ప‌టి నుండో ప్రేమించుకుంటున్న మౌనిరాయ్‌, సూర‌జ్ నూత‌న వ‌ధూవ‌రులుగా పెళ్లిదుస్తుల్లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరి జంట‌ను చూసిన అభిమానులు మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటూ విషెస్ చెబుతున్నారు. మౌనిరాయ్ పెళ్లి విశేషాల‌ను ఆమె భ‌ర్త సూర‌జ్ నంబియార్‌, ఫ్రెండ్ అర్జున్ బిజ్లానీ మందిరాబేడి ప్ర‌తి మూవ్‌మెంట్ ను అభిమానుల కోసం సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. హ‌ల్దీ ఫంక్ష‌న్ నుంచి మెహందీ, సంగీత్‌, వెడ్డింగ్ ఇలా అన్నీ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

Mouni Roy, Suraj Nambiar share first official pics from their Goa wedding: ' I found him at last' - Hindustan Times

Advertisement

పెళ్లి వేడుక‌లో మౌనీరాయ్ ఎంతో సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో పెళ్లికూతురుగా అదిరిపోయింది. ఎరుపు రంగు అంచుతో ఉన్న తెల్ల‌ని చీర క‌ట్టుకుంటే ఆమె భ‌ర్త సూర‌జ్ పెళ్లి కొడుకుగా గోల్డెన్ క‌ల‌ర్ కుర్తా, వైట్ క‌ల‌ర్ దోతి వేసుకున్నాడు. ఇద్ద‌రు క‌లిసి పెళ్లి మండ‌పంలో దిగిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్ లో సూర‌జ్‌ పోస్ట్ చేశాడు. ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ ఇద్ద‌రు సెలబ్రిటిలు మ‌ల‌యాళ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఒక్క‌టయ్యారు.

Advertisement

Mouni Roy Suraj Nambiar share beautiful pictures from their Goa wedding:  Need your love and blessings | Celebrities News – India TV

నిన్న‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియా పేజ్‌లో క‌నిపించిన మౌనిరాయ్ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా పెళ్లికూతురు గెట‌ప్‌లో సిగ్గుమొగ్గ‌లు వేస్తూ క‌నిపించింది. బంధు, మిత్రుల మ‌ధ్య సూర‌జ్ ఆమెకు మంగ‌ళ‌సూత్రం క‌ట్ట‌డంతో అంద‌రూ పూల‌వ‌ర్షం కురిపించారు. మూనిరాయ్‌, సూర‌జ్ నంబియార్ వెడ్డింగ్ పార్టీకి ఫ్రెండ్స్ మందిరా బేడీ, అర్జున్ బిజ్లానీతో పాటు మ‌రికొంద‌రు సెల‌బ్రిటిలు అటెండ‌య్యారు. క‌పుల్‌గా మారిన మౌనిరాయ్, సూర‌జ్ నంబియార్ ప్ర‌తి వీడియోల‌ను షేర్ చేసుకుంటున్నారు.

I found him at last” - Mouni Roy about husband, Suraj Nambiar | Filmfare.com

పెళ్లికి ముందు జ‌రిగిన సంగీత్‌లో కూడా మౌనిరాయ్ ప‌సుపు రంగు డ్రెస్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసింది. 2004లోనే సినిమాల్లోకి వ‌చ్చినా నాగిన్ సిరియ్తో బాగా పేరు వ‌చ్చింది. టీవీషోలు, సీరియ‌ల్స్ లో సంద‌డి చేసింది. సినిమాల్లోనూ స‌త్తా చాటుతున్న‌ది. తుమ్ బిన్‌2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటం సాంగ్‌లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది మౌనీరాయ్‌. బ్ర‌హ్మ‌స్త్ర‌, మొగుల్ సినిమాల్లో న‌టిస్తోంది. పెళ్లి త‌రువాత మ‌రీ న‌టిస్తుందో లేక ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి మ‌రి.

Visitors Are Also Reading