Telugu News » ప్రభాస్ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే…!

ప్రభాస్ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే…!

by AJAY MADDIBOINA

ఇండ‌స్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హిరో చేసి హిట్ కొట్టిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. హీరోలు అనేక కార‌ణాల వల్ల మిస్ చేసుకున్న సినిమా క‌థలు మ‌రో హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌డం సినిమా బాగుండి మంచి విజ‌యం సాధించ‌డం సాధార‌ణ‌మే. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనూ అలా మిస్ చేసుకున్న 5 సినిమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Ads

ఆర్య‌

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ఆర్య సినిమా క‌థ‌ను మొద‌ట‌గా సుకుమార్ ప్ర‌భాస్ కు వినిపించారు. కానీ ప్ర‌భాస్ ఆసక్తిచూపించ‌కపోవ‌డంతో ఆ క‌థ‌ను అల్లు అర్జున్ కు వినిపించి సినిమా తీశారు.

కిక్

ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి మొద‌ట ప్ర‌భాస్ తో తీయాల‌ని అనుకున్నాడు. కానీ ప్ర‌భాస్ రిజెక్ట్ చేయ‌డంతో సురేందర్ రెడ్డి ర‌వితేజను హీరోగా పెట్టి తీశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఒక్క‌డు

సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు కెరీర్ ను మ‌లుపు తిప్పిన సినిమా ఒక్క‌డు. అయితే ఈ సినిమా క‌థ‌ను కూడా మొద‌ట ప్ర‌భాస్ విన్నాడు. కానీ క‌బ‌డ్డీ ఆట‌పై గ్రిప్ లేక పోవ‌డంతో సినిమాను వ‌దులుకున్నాడు.

నాయ‌క్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన సినిమా నాయ‌క్. ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేసి ఆక‌ట్టుకున్నారు. అయితే ఈ సినిమా ముందుగా ప్ర‌భాస్ వ‌ద్ద‌కే వెళ్లింది. కానీ స్టోరీ న‌చ్చ‌క‌పోవ‌డంతో ప్ర‌భాస్ నో చెప్పాడు.

సింహాద్రి

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి చ‌త్ర‌ప‌తి సినిమా కంటే ముందే ప్ర‌భాస్ తో ఓ సినిమా తీయాల‌నుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా న‌టించిన సింహాద్రి సినిమాను మొద‌ట ప్ర‌భాస్ కు వినిపించాడు. కానీ ప్ర‌భాస్ సింహాద్రి క‌థ త‌నకు సెట్ కాద‌ని నో చెప్పాడు.


You may also like