Home » న‌ల్ల జీలక‌ర్ర‌ను వాస‌న పీల్చితే ఏమౌతుందో తెలుసా..?

న‌ల్ల జీలక‌ర్ర‌ను వాస‌న పీల్చితే ఏమౌతుందో తెలుసా..?

by Anji
Ad

ముఖ్యంగా కొంత మందికి నీటిని తాకితే చాలు ఎండాకాలం, వానా కాలం అని తేడా లేకుండా జ‌లుబు అవుతుంటుంది. జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. ఈ స‌మ‌స్య‌లు ఎక్కువైతే త‌ల డిమ్ముగా ఉండి.. ఏ ప‌ని మీద ఏకాగ్ర‌త ఉండ‌దు. ఈ స‌మ‌స్య త‌గ్గాలంటే ఇంగ్లీషు మందులు అంత‌గా ప‌ని చేయ‌వు. ఒక‌వేళ వాడినా ఆ యాంటి బ‌యోటిక్ మందుల కార‌ణంగా మ‌న శ‌రీరంలో రోగ నిరోద‌క శ‌క్తి త‌గ్గిపోతుంది. అందువ‌ల్ల జ‌లుబు త‌గ్గ‌డానికి మ‌న ఇంటిలో ఉండే వ‌స్తువుల‌తో సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.


ఈ ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. చిటికెడు పుసుపు, చిటికెడు శొంఠిపొడిని తేనేలోక‌లిపి తీసుకుంటే ద‌గ్గు త‌గ్గ‌డంతో పాటు జ‌లుబు కార‌ణంగా వ‌చ్చే త‌ల‌నొప్పిని కూడా త‌గ్గిస్తుంది. అల్లం ర‌సంలో తేనే క‌లిపి తీసుకుంటే ద‌గ్గు జ‌లుబునుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూను మిరియాల పొడి, స‌రిప‌డ బెల్లం వేసి మ‌రిగించాలి. ఈ క‌షాయం చ‌ల్లారిన త‌రువాత త్రాగితే ద‌గ్గు జ‌లుబు నుంచి మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఒక గ్లాస్ పాల‌లో చిటికెడు ప‌సుపు వేసుకుని రాత్రి ప‌డుకునే ముందు తాగితే మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Advertisement

Advertisement


ప‌సుపు కొమ్మును కాల్చి ఆ వాస‌న‌ను పీల్చితే ముక్కు దిబ్బ‌డ త‌గ్గుతుంది. మిరియాల చూర్ణం, బెల్లం స‌మాన ప‌రిమాణంలో తీసుకొని బాగా క‌లిపి తీసుకుంటే ద‌గ్గు త‌గ్గుతుంది. ఒక స్పూన్ తేనేలో మిరియాల పొడివేసి రోజులో 4 నుంచి 5సార్లు తీసుకుంటే జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. చిన్న పిల్ల‌ల‌లో ముక్కు దిబ్బ‌డ‌గా ఉన్న‌ప్పుడు వామును మూట క‌ట్టి వారి ప‌క్క‌న పెడితే వాము నుంచి ఘాటైన వాస‌న పీల్చుతారు. దీంతో ముక్కు దిబ్బ‌డ త‌గ్గుతుంది. ఒక క‌ప్పు నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి మ‌రిగించి ఆ క‌షాయానికి తేనె క‌లిపితే జ‌లుబు త‌గ్గిపోతుంది.

కొంత మందికి జ‌లుబు చేసిన‌ప్పుడు తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అప్పుడు కొత్తిమీర వాస‌న చూస్తే తుమ్ములు త‌గ్గుతాయి. న‌ల్ల జీల‌క‌ర్ర‌ను మూట క‌ట్టి అప్పుడ‌ప్పుడు అప్పుడ‌ప్పుడు న‌లిపి వాస‌న చూస్తుంటే ముక్కు దిబ్బ‌డ నుంచి తొంద‌ర‌గా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. మ‌రిగే నీటిలో ఉల్లిపాయ ముక్క‌ను వేసి ఆవిరి ప‌డితే ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. నీటిలో ప‌సుపు, ఉప్పు వేసి క‌లిపి ఆ నీటిలో త‌ర‌చుగా పుక్కిలిస్తూ ఉంటే త్వ‌ర‌గా త‌గ్గుతుంది. ఈ చిట్కాల‌తో పాటు రోజులో8 వీలైన‌న్న సార్లు గోరు వెచ్చ‌ని నీటిని తాగండి.

Also Read :  ఆకాశాన్నంటిన ఆర్ఆర్ఆర్ టికెట్ ధ‌ర‌..హైద‌రాబాద్లో ఒక్క టికెట్ రూ.5వేలు..!

Visitors Are Also Reading