విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు జరిగిన వెంటనే నిపుణులు బ్లాక్ బాక్స్ కోసం గాలిస్తుంటారు. ప్రమాదంలో విమానం లేదా హెలికాప్టర్ పూర్తిగా దగ్దమైనప్పటికీ బ్లాక్ బాక్స్‌కు ఏమీ కాదు. ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రత్యేకమైన మెటల్‌తో తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతను, వేడిని తట్టుకొని ఉంటుంది. అదేవిధంగా, ఈ బ్లాక్ బ్లాక్స్ నీటిలో పడినా ఏమీ కాకుండా ఉంటుంది. విమానంలో కావొచ్చు లేదా హెలికాప్టర్‌లో కావొచ్చు రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి. అందులో ఒకటి ప్లైట్ జెట్ రికార్డర్.
Advertisement
ఇది విమానం ఎంత ఎత్తులో వెళ్తున్నది, ఎలా వెళ్తున్నది. ఏ దిశలో ప్రయాణం చేస్తుంది. ఎంత వేగంతో ప్రయాణం చేస్తున్నది అనే విషయాలను ఈ బ్లాక్ బాక్స్ నిక్షిప్తం అవుతాయి. ఇక రెండో బ్లాక్ బాక్స్ కాక్‌పిట్ రికార్డర్. ఈ కాక్‌పిట్ రికార్డర్‌లో పైలట్‌లు ఏం మాట్లాడుకున్నారు. దేని గురించి మాట్లాడారు ప్రమాదం సమయంలో గ్రౌండ్ సిబ్బందితో ఏం మాట్లాడారు అనే విషయాలు ఈ బ్లాక్ బాక్సులో రికార్డ అవుతాయి.
Advertisement
ఈ కాక్‌పిట్ రికార్డర్ విమానం తోక భాగంలో అమర్చి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు తోకభాగం తక్కువ డ్యామెజ్ అవుతుంది. కాక్ పిట్ బ్లాక్ బాక్స్‌లో సమాచారం ఆధారంగా ప్రమాదాన్ని అంచనా వేస్తారు. నిన్న తమిళనాడులోని కూనూరు అటవీప్రాంతంలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణం చేస్తున్న ఎంఐ హెలికాప్టర్ కూలిపోయింది. పొగమంచు కారణంగా హెలికాప్టర్ కూలిపోయి ఉండోచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హెలికాప్టర్ కూలిన తరువాత బ్లాక్ బాక్స్‌ను ఈరోజు అధికారులు కనిపెట్టారు. రెండు బ్లాక్ బాక్స్‌లను ఈరోజు ఢిల్లీకి తరలించారు. ప్రమాదం జరిగే ముందు పైలట్ సంభాషణలు అందులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సంభాషణలు రికార్డైతే విచారణ వేగవంతం అవుతుంది.