Home » ప్రియురాలితో పెళ్లి కోసం చనిపోయినట్టు నాటకం…కానీ ఆ మిస్టేక్ తో సీన్ రివర్స్…!

ప్రియురాలితో పెళ్లి కోసం చనిపోయినట్టు నాటకం…కానీ ఆ మిస్టేక్ తో సీన్ రివర్స్…!

by AJAY
Ad

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు సినిమా రేంజ్ లో పథకం వేశాడు. స్నేహితుల సహాయంతో తన హత్య జరిగినట్టు సృష్టించాడు. కానీ చివరకు చిన్న మిస్టేక్ తో దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే…. బీహార్ రాష్ట్రంలోని చెప్రా జిల్లాలోని టోలా గ్రామానికి చెందిన మున్నా 22 అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆమెతో పెళ్లికి మున్నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

Advertisement

దాంతో తల్లిదండ్రులతో గొడవపడి మున్నా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం మున్నా స్నేహితులు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడిని ఎవరో హత్య చేసి రోడ్డుపై పడేశారు అని చెప్పారు. దాంతో వెంటనే తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాని అక్కడ మృతదేహం కనిపించలేదు. రక్తం మాత్రం ఉంది. అయితే మున్నా శవాన్ని ఎవరో మాయం చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇక ఘటనా స్థలంలో బాడీ లభించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువకుడి మృతదేహం కోసం గ్రామంలోని పరిసర ప్రాంతాలన్నీ జల్లెడ పట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే మున్నా సెల్ ఫోన్ మళ్లీ స్విచ్ ఆన్ అయినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే లొకేషన్ ట్రాక్ చేసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాంతో సీన్ రివర్స్ అయింది. తన ప్రియురాలి తో మున్నా సహజీవనం చేస్తున్నట్ట పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ ఇద్దరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో తాను చనిపోయినట్టు క్రియేట్ చేశాడని పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు తల్లిదండ్రులకు, యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Visitors Are Also Reading