Home » అక్కినేని అభిమానులని షాక్ కి గురు చేస్తున్న నాగార్జున నిర్ణయం ! మీరు సమర్థిస్తారా ?

అక్కినేని అభిమానులని షాక్ కి గురు చేస్తున్న నాగార్జున నిర్ణయం ! మీరు సమర్థిస్తారా ?

by AJAY
Ad

ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన హీరోలకు ఇప్పుడు పెద్దగా హిట్లు ప‌డ‌టం లేదు. ఎంత కష్టపడినా ఏం చేసినా హిట్లు మాత్రం పడటం లేదు. ఫామ్ లో ఉన్న దర్శకులు వ‌చ్చి భారీ బడ్జెట్ తో సినిమాలు చేసినా కలిసి రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హీరో నాగార్జునది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత నాగ్ కు సరైన హిట్ ప‌డ‌లేదు.

Advertisement

దాంతో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నాగార్జున నిర్ణయం తీసుకున్నారు అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వెంకటేష్ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సరైన హిట్స్ పడకపోవడంతో అంతేకాకుండా ఆఫర్లు లేక వెంకటేష్ కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు నాగార్జున‌ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటున్నారని టాలీవుడ్ లో వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Advertisement

nagarjuna ap tickets issue

రీసెంట్ గా ది గోస్ట్ సినిమాతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన రేంజ్ లో విజ‌యం సాధించలేదు. దాంతో నాగార్జున సరైన కథ దొరికే వరకు సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారట. అందువల్లే మంచి కథ దొరికే వరకు సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

NAGARJUNA

NAGARJUNA

మరోవైపు నాగార్జున ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. అదేవిధంగా తన వద్దకు వచ్చిన దర్శకులకు సైతం నాగార్జున ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటున్నానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజ‌న్ పూర్తి కావ‌డానికి మరికొన్ని వారాలు పడుతుంది. మరి సినిమాలకు దూరంగా ఉంటే నాగార్జున ఫ్యాన్స్ సమర్ధిస్తారో లేదో చూడాలి.

Visitors Are Also Reading