తెలుగు ఇంటి ఆడపిల్ల బిగ్‌బాస్ టైటిల్ ను సాధించి బిగ్‌బాస్ హిస్టరీలోనే రికార్డు సృష్టించింది. 84 రోజులు 18 మంది పడిపోవడం కాదు. పడిపోయిన ప్రతిసారి నిలబడితేనే విజయం వరిస్తుంది. గెలుపు కోసం ఎంతో కష్టపడింది బిందు మాధవి. నాన్ స్టాప్ విజేతగా అవతరించి కొత్త చరిత్రకు నాం ది పలికింది. తన బలహీనతనే హౌస్‌లో బలంగా మార్చుకుంది. ఇది మాట కాదు.. తూటా అన్నట్టుగా చెలరేగింది.
Advertisement
ముఖ్యంగా పిచ్చిది, మెంటల్‌ది, గేమ్ ఆడడం రాదని ఆమె జీరో అని నిందించిన నోళ్లన్ని ఇప్పుడు మూతపడేటట్టు చేసి హౌస్‌లోనే ఉగ్రరూపం దాల్చింది. కొట్టడానికి మీదికొచ్చిన వారికి కప్పు నీ ముందే తీసుకుని చూపిస్తా అని శపథం చేసిందన్నట్టుగా కొట్టి చూపించింది. పక్కా స్ట్రాటజీతో తన ఆట ఆడింది బిందు మాధవి. ఆట తప్ప వేరే ధ్యాస లేదన్నట్టుగానే గేమ్‌లో ముందుకు కొనసాగింది. హౌస్‌లో ఎవరితో బాండింగ్ ఉంచుకోవాలి. ఎవరికీ దూరంగా ఉండాలి. ఎవరితో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండాలో పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లింది. యాంకర్ శివతో కాకుండా వేరే వారితో బిందు ఫ్రెండ్ చేస్తే మరోలా వెళ్లేది కానీ.. శివతో ఫ్రెండ్‌షిప్ చేయడం వారి ట్రాక్ మరో రూట్‌లోకి వెళ్లలేదు. బిందు ముందు చూపుతోనే ఆలోచించింది.
Advertisement
#ConquerorBinduMadhavi#BinduMadhavi #BiggBossNonStop
Bindu Representing All The Fandom Reaction Here🥳🥳🥳♥️♥️♥️
Yesssssssss💥💥💥 pic.twitter.com/gHibWk4G7R— gvsdileep🥰 (@gvsdileep) May 21, 2022
మాట్లాడే మాట, ప్రవర్తించే తీరు.. ప్రతి విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకుంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో మనం ఎలా ఉన్నామన్నది కాదు.. మనల్ని ఎలా చూపించారన్నది ముఖ్యం. పాయింట్‌ను బాగా పసిగట్టిన బిందు ఎక్కడ లూజ్ కాకుండా ఎలాంటి కంటెంట్ ఇస్తే బిగ్ బాస్ వాళ్లు హైలైట్ చేస్తారో అలాంటి కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంది. అఖిల్‌ను ఆడ అని.. నటరాజ్ మాస్టర్‌ని రా అని అనడం.. మైక్‌ని నేలకేసి కొట్టడం తినే కంచాన్ని పక్కకు తోసేయడం లాంటివి ఆమె చేసిన మిస్టేక్స్ అయినా వాటిని డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ సాధించింది బిందు మాధవి.
Late bloomers this is for you guys.#ConquerorBinduMadhavi#BinduMadhavi #BiggBossNonStop pic.twitter.com/kYVLcPLmSm
— Its_BMBB1 ᵂᴵᴺᴺᴱᴿ ᴮᴵᴺᴰᵁ (@Its_BMBB1) May 21, 2022
Advertisement