Home » న్యూస్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేసిన స‌న్నీ…ఈ స్టేజ్ కి రావ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలుసా..?

న్యూస్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేసిన స‌న్నీ…ఈ స్టేజ్ కి రావ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలుసా..?

by AJAY
Ad

వెండి తెర అయినా బుల్లి తెర అయినా ఇండ‌స్ట్రీలో పైకి రావ‌డం అంటే అంత ఈజీ కాదు. ఇండ‌స్ట్రీలో దాదాపు స‌గంమంది వార‌సులే క‌నిపిస్తుంటారు. అదో రంగుల ప్ర‌పంచం కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రికీ అందులో విహ‌రించాల‌నే కోరిక గట్టిగా ఉంటుంది. అయితే కోరిక ఉంటే స‌రిపోదు…దానికి త‌గ్గ‌ట్టుగా క‌ష్ట‌పడాలి. ఇక సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి ఎద‌గాలంటే ఎంత కష్ట‌ప‌డాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. అలా ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను అనుభ‌వించి ఇప్పుడు బిగ్ బాస్ విన్న‌ర్ అయ్యే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న వ్య‌క్తి వీజే స‌న్నీ. అయితే వీజే స‌న్నీకి ఈ స్టేజ్ కి రావ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. స‌న్నీ తెలంగాణాలోని ఖ‌మ్మం జిల్లాలో జ‌న్మించాడు. ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కూ ఖమ్మంలోనే చ‌దువుకున్న స‌న్నీ ఆ త‌ర‌వాత హైద‌రాబాద్ లో డిగ్రీ పూర్తి చేశాడు.

BIGG BOSS VJ SUNNY

BIGG BOSS VJ SUNNY

ఆ త‌రవాత ఏబీఎన్ ఛాన‌ల్ లో న్యూస్ రిపోర్టర్ గా త‌న కెరీర్ ను ప్రారంభించాడు. ఏబీఎన్ ఛాన‌ల్ లో స‌న్నీ ప‌నిచేసిన్పుడు నాగ్ ను ఇంట‌ర్యూ చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇక‌ న్యూస్ రిపోర్టర్ అంటే స‌న్నీ 20వేల నుండి 30 వేల జీతానికి ప‌నిచేసి ఉంటాడు. అలా అంచ‌లంచ‌లుగా ఎదిగి మాటీవీలోనూ యాంక‌ర్ గా పనిచేశాడు. త‌ర‌వాత న‌ట‌న‌పై త‌న‌కు ఉన్న ఆస‌క్తితో సీరియ‌ల్స్ లో న‌టించ‌డం ప్రారంభించాడు. మొద‌ట‌గా స‌న్నీ క‌ల్యాణ వైభోగ‌మే అనే టీవీ సీరియ‌ల్ లో లీడ్ రోల్ చేశాడు.

Advertisement

Advertisement

ANCHOR SUNNY

ANCHOR SUNNY

ఆ త‌రవాత వ‌రుస‌గా సీరియ‌ల్ ఆఫ‌ర్లు రావ‌డంతో ఫుల్ బిజీగా మారాడు. అంతే కాకుండా ప‌లు చిత్రాల్లోనూ ఆయ‌న న‌టించి అల‌రించాడు. అయితే సినిమాల్లో మాత్రం అనుకున్న మేర స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయాడు. కానీ ప్ర‌స్తుతం స‌న్నీ బిగ్ బాస్ సీజ‌న్ 5లో కంటెస్టెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట కొన్ని ఎపిసోడ్ ల వ‌ర‌కూ స‌న్నీకి పెద్ద‌గా ఫాలోయింగ్ రాలేదు. కానీ రాను రాను అత‌డికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. జెన్యూన్ కంటెస్టెంట్ అంటూ స‌న్నీకి ఓట్లు వేస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ ప్రేక్ష‌కులు స‌న్నీ టాప్ టూ లో ఒక‌డు అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఎంతో క‌ష్ట‌ప‌డి ఎదిగిన స‌న్నీ బిగ్ బాస్ టైటిల్ పోరాటంలో గెలుస్తాడో లేదో చూడాలి.

Visitors Are Also Reading