Home » బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు అతిధులుగా బాలీవుడ్ స్టార్స్..!

బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు అతిధులుగా బాలీవుడ్ స్టార్స్..!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5 క‌థ క్లైమాక్స్ కు చేరిపోయింది. ఈ వారంతో బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ ఎవ‌రు అన్న‌ది తేలిపోనుంది. దాంతో గ‌త వారాల కంటే ఈ వారం పై ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఆస‌క్తి పెరిగిపోయింది. ఇక‌ కాజల్ ఎలిమినేషన్ తో షన్ను,సిరి, స‌న్నీ, శ్రీరామ్, మాన‌స్ లు ఫినాలే కు చేరుకున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి మొదలైంది. ఇక‌ డిసెంబర్ 19న ఆదివారం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే గత సీజ‌న్ల‌ కంటే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేనే చాలా గ్రాండ్ గా చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

bigg boss season 5

bigg boss season 5

అంతే కాకుండా మొదట ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని గ్రాండ్ ఫినాలే అతిథులుగా తీసుకువస్తారంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు బాలీవుడ్ తార‌ల వైపు చూస్తున్న‌ట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌న్ వీర్ సింగ్, దీపికా పదుకొనే…. అంతే కాకుండా మరో బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ ను సైతం బిగ్ బాస్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అదేవిధంగా టాలీవుడ్ నుండి రామ్ చరణ్ ను సైతం గ్రాండ్ ఫినాలే కు తీసుకువచ్చే ఆలోచ‌న‌లో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్- 4 మరియు బిగ్ బాస్ సీజన్- 3 గ్రాండ్ ఫినాలే కు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సంద‌డి చేసిన‌ సంగతి తెలిసిందే. మ‌రీ బిగ్ బాస్ సీజ‌న్ -5 కి ముఖ్య అతిథులుగా ఎవ‌రు వ‌స్తారు..? ఎలాంటి ఎంట‌ర్టైన్ మెంట్ ఉండ‌బోతుంది అన్న‌ది తెలియాలంటే ఆదివారం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading