Home » Bigg Boss OTT Telugu : ఈసారి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే మూడు రోజుల పాటు సంద‌డి..!

Bigg Boss OTT Telugu : ఈసారి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే మూడు రోజుల పాటు సంద‌డి..!

by Anji
Ad

Bigg Boss OTT Telugu : హౌస్‌లో కంటెస్టెంట్స్ కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే ఉండేవారు. కానీ ఈసారి మాత్రం చివ‌రి వారం ముగియ‌బోతున్నా.. ఇంకా ఏడు మంది ఉన్నారు. రెండు వారాలు కొన‌సాగించే అవ‌కాశం అస్స‌లు లేదు. ఒక‌టి రెండు రోజుల్లో మొత్తం షోకు పేక‌ప్ చెప్ప‌బోతున్నారు. ఇక ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా విభిన్నంగా జ‌రుగ‌నున్న‌దంటూ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వారి నుంచి స‌మాచారం తెలుస్తోంది.

Advertisement

ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ఏకంగా మూడు రోజుల పాటు చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. మామూలుగా అయితే రెండు రోజులు మాత్ర‌మే చిత్రీక‌ర‌ణ చేస్తారు. కానీ ఈద‌ఫా గురువారం నుంచి ప్రారంభ‌మై ఒక్కోరోజు ఒక్క‌రిని ఎలిమినేట్ చేస్తుంటారు. ఇక డ్యాన్స్ కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో పాటు పాత కంటెస్టెంట్స్ అంతా కూడా స్టేజ్ పై సంద‌డి చేసే ఎపిసోడ్ చివ‌రి రోజు చిత్రీక‌రిస్తారు. సినిమా ప్ర‌మోష‌న్స్ తో పాటు ఇత‌ర ప్ర‌మోష‌న్స్ కోసం బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫినాలేను ఉప‌యోగించుకోబోతున్న‌ట్టు స‌మాచారం. గురువారం ఎపిసోడ్‌లో 1, శుక్ర‌వారం ఎపిసోడ్‌లో ఒక‌రు ఎలిమినేట్ అవ్వ‌గా.. చివ‌రి రోజు టాప్ ఐదుగురు మాత్ర‌మే మిగులుతారు.

Advertisement

ఇది చాలా విభిన్న‌మైన‌ది అని బిగ్ బాస్ ప్రేక్ష‌కులు, ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. ఈ సీజ‌న్ విన్న‌ర్ విష‌యంపై ఇంకా స్ప‌స్ట‌త రాలేదు. గ‌త సీజ‌న్‌లో స‌న్నీ అంటూ అంతా బలంగా న‌మ్మారు. అంద‌రూ అనుకున్న విధంగానే ఆయ‌న విజేత‌గా నిలిచాడు. కానీ ఈసారి మాత్రం ముగ్గురి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో యాంక‌ర్ శివ కాస్త త‌క్కువ అయినా బింధుమాధ‌వి, అఖిల్ సార్ద‌క్‌లు ట్రోపీ కోసం హోరా హీరీ అన్న‌ట్టుగా ఉన్నారు. టాప్ 3లో యాంక‌ర్ శివ‌, బిందు, అఖిల్ నిల‌వ‌డం 100 శాతం గ్యారెంటీ. విజేత‌పై ఇప్పుడే ఓ అంచ‌నా వేయ‌లేము. ఆదివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఫుల్ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Also Read : 

నేడే Vivo X80, Vivo X80 Pro స్మార్ట్‌ఫోన్‌ల విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

పెద్ద‌దేవుడికి కొత్త కోడ‌ళ్ల ప‌రిచ‌యం.. అడ‌వుల జిల్లాలో పెర్స‌పేన్ ఉత్స‌వం

Visitors Are Also Reading