Home » జెస్సీ జెట్ స్పీడ్ లో ఉన్నాడుగా…ఏకంగా హీరో ఛాన్స్…!

జెస్సీ జెట్ స్పీడ్ లో ఉన్నాడుగా…ఏకంగా హీరో ఛాన్స్…!

by AJAY
Ad

రీసెంట్ గా బిగ్బాస్ సీజన్- 5 ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే నటరాజ్ మాస్టర్ ఏకంగా హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. యానీ మాస్టర్ కు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. లోబో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోడల్ జెస్సీ కూడా ఏకంగా హీరో అవతారమెత్తాడు. జెస్సీ ఎర్రర్ 500 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు ప్రకటించాడు.

Advertisement

Bigg Boss jessy

Bigg Boss jessy

అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను సైతం విడుదల చేశాడు. పోస్టర్ లో తుపాకి పట్టుకుని జెస్సీ అదరగొట్టాడు. ఇదిలా ఉంటే జెస్సీ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ లో అవకాశం రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లో షన్ను, సిరిలతో స్నేహం చేసాడు. వీళ్ళ ముగ్గురికి బయట కొంత మంది అభిమానులు కూడా అయ్యారు. అయితే జెస్సీ అనారోగ్య కారణాల వల్ల బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తూ….పలువురు సెలబ్రిటీల తో పబ్బులకు వెళుతూ ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పుడు తను హీరోగా నటిస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరి ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading