Telugu News » స్టార్ మా పై యాని ఫైర్…నేను కూడా కంప్లైంట్ చేస్తానంటూ…!

స్టార్ మా పై యాని ఫైర్…నేను కూడా కంప్లైంట్ చేస్తానంటూ…!

by AJAY MADDIBOINA

బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ లపై సోషల్ మీడియాలో రోజు చర్చలు జరగటం కామనే…కొందరు తమకు నచ్చిన సభ్యుడికి ఓట్లు వేయడంతో పాటు నచ్చని సభ్యులపై నెగిటివ్ ప్రచారం మొదలు పెడతారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనను తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో పరుష పదజాలం తో దూషిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Ads

ఇక గతంలోనూ నాలుగు బిగ్ బస్ సీజన్ లు పూర్తయ్యాయి కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంటి సభ్యుల ఈ రేంజ్ లో నెగిటివ్ ప్రచారం జరగలేదు. ఇక తాజాగా రవి పోలీ సులకు ఫిర్యాదు చేయడం తో యాని మాస్టర్ కూడా సౌండ్ పెంచింది. తాను కూడా పో లీసులకు ఫిర్యాదు చేస్తా అంటూ ఫైర్ అయ్యింది. తాను హౌస్ లో జెన్యూన్ గా ఉన్నాను అని కానీ బిగ్ బాస్ మొత్తం సీన్లు ప్రసారం చేయలేదు అని ఆరోపించింది. బిగ్ బాస్ లో 24 గంటలు ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చింది.


You may also like